RGV: మరో యువతిపై ఆర్జీవీ కన్ను.. ఆమెతో చీర మూవీ చేస్తానని అనౌన్స్.. ఇంతకీ ఎవరా పిల్ల?-ram gopal varma announces saree movie with sreelakshmi satheesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv: మరో యువతిపై ఆర్జీవీ కన్ను.. ఆమెతో చీర మూవీ చేస్తానని అనౌన్స్.. ఇంతకీ ఎవరా పిల్ల?

RGV: మరో యువతిపై ఆర్జీవీ కన్ను.. ఆమెతో చీర మూవీ చేస్తానని అనౌన్స్.. ఇంతకీ ఎవరా పిల్ల?

Sanjiv Kumar HT Telugu
Sep 29, 2023 11:46 AM IST

RGV Sreelakshmi Satheesh: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేదు. ఆయన కన్ను పడిన ముద్దుగుమ్మలు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో యువతి గురించి పొగడటం మొదలుపెట్టాడు ఆర్జీవీ.

మరో యువతిపై ఆర్జీవీ కన్ను.. ఆమెతో చీర మూవీ చేస్తానని అనౌన్స్.. ఇంతకీ ఎవరా పిల్ల?
మరో యువతిపై ఆర్జీవీ కన్ను.. ఆమెతో చీర మూవీ చేస్తానని అనౌన్స్.. ఇంతకీ ఎవరా పిల్ల? (Instagram)

శివ, సత్య, సత్య 2, రక్త చరిత్ర వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి గురంచి తెలిసిందే. ఏదైనా మనసులో అనిపిస్తే బయట పెట్టేస్తాడు ఆర్జీవీ. ఆయన ఇచ్చినంతగా బోల్డ్ ఆన్సర్స్ ఎవరూ ఇవ్వలేరు. ట్విటర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సంచలనాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన అమ్మాయిలను పొగిడే విధానం, సినిమాల్లో చూపించి తీరు తెలిసిందే.

డేంజరస్, నేక్‍డ్ వంటి హీరోయిన్ ఒరియెంటెండ్ చిత్రాలు కూడా చేశాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాకుండా తనను ఇంటర్వ్యూ చేసిన అరియానా గ్లోరిని ఆర్జీవీ పొగడటంతో ఆమె తెగ పాపులర్ అయింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానాతో రామ్ గోపాల్ వర్మ స్టెప్పులేయడంతో ఆమె వీడియో వైరల్ అయింది. ఇక డేంజరస్ మూవీతో మాత్రమే కాకుండా తరచుగా అప్సరా రాణి హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వాళ్లకు క్రేజ్ తీసుకొస్తుంటాడు.

అలాంటి రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు ఓ అమ్మాయిపై పడింది. ఆర్జీవీ మనసు దోచిన ఆ ముద్దుగుమ్మ కేరళకు చెందిన శ్రీలక్ష్మీ సతీష్. ఈమె సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అందులోనే ఆమె చీర కట్టుకుని ఓ రీల్ చేసింది. ఆమె చీర వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ మరి శ్రీలక్ష్మీ అందాన్ని పొగిడేశాడు రామ్ గోపాల్ వర్మ.

"చీరకట్టు అనేది చాలా అందమైనదని ఎంతోమంది చెప్పిన నేను నమ్మలేదు. కానీ, ఇప్పుడు నిన్ను చూశాకే నాకు అది అర్థమైంది" అని రాసుకొచ్చాడు ఆర్జీవీ. అంతేకాకుండా "ఈ వీడియో చూశాకా నీతో SAAREE (చీర) అనే సినిమా తీస్తాను" అని ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. నువ్ చూపించిన వీడియో వర్త్ వర్మ వర్త్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టును ముద్దుగుమ్మ శ్రీలక్షీ సతీష్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. అంటే రామ్ గోపాల్ వర్మ తనతో సినిమా చేయడం శ్రీలక్ష్మీ సతీష్‍కు అంగీకారమే అని పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వర్మ పెట్టిన పోస్టుతో ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్లు 50 వేలకు చేరడం విశేషం.

Whats_app_banner