RGV Your Film: ప్రేక్షకులతో సినిమా.. ఆర్జీవీ కొత్త ప్రయోగం యువర్ ఫిల్మ్.. హీరో డైరెక్టర్ మీరు సెలెక్ట్ చేసిన వారితోనే!
Ram Gopal Varma Your Film: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నాడు. అన్ని నిర్ణయించే ప్రేక్షకులే సినిమా తీస్తే ఎలా ఉంటుందని యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్టుతో వచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Ram Gopal Varma Your Film: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన వెరైటీగానే ఉంటుదని తెలిసిందే. ట్వీట్ల నుంచి చేసే పనులు, డైరెక్ట్ చేసే సినిమాలు, హీరోయిన్లను చూపించే విధానం వరకు వర్మ స్టైల్ డిఫరెంట్. ఇప్పటికీ పలు ఐకానిక్, కాంట్రవర్సీ, బోరింగ్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఈసారి ప్రేక్షకులతోనే సినిమా చేయాలని భావించాడు. యువర్ ఫిల్మ్ అనే కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు అదే ఆడియెన్స్‌తో రానున్నాడు.
ఆర్జీవీ డెన్ వేదికగా శనివారం (ఏప్రిల్ 6) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్‌ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్స్‌ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో ఎంపిక చేయాలని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ప్రజలే ఎన్నుకుని, ఓటింగ్‌లో ముందంజలో ఉన్న వారితో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా సినిమాను ఆరు నెలలలో తీసి రిలీజ్ చేస్తారు.
సినిమా కథను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డీఓపీ, మ్యూజిక్ డైరక్టర్ ఇలా అందరూ కూడ అప్లై చేసుకోవచ్చు. ప్రేక్షకులు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి, ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని ఆర్జీవీ డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్‌సైట్‌లో పెడతారు.
ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ పెట్టే టాస్క్‌లని బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆడిషన్స్‌లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డీఓపీ ఇలా అందరూ కూడా ప్రేక్షకుల ద్వారా ఎన్నుకోబడతారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం. అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా. ఈ యువర్ ఫిల్మ్ అనేది భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో చేయనున్నారు. దానికి ఆర్జీవీ డెన్ నుంచి నిర్మాణం జరగనుంది.
ఇదిలా ఉంటే, ఇటీవల రామ్ గోపాల్ వర్మ చాలా వరకు కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గానే పొలిటికిల్ థ్రిల్లర్స్‌గా వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కించారు. వ్యూహం చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన వ్యూహం మూవీలో వైఎస్ జగన్ పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణర్ కనిపించనుంది. ఈ ఇద్దరితోపాటు వ్యూహం మూవీలో రేఖ నిరోష, సురభి ప్రభావతి, ధనుంజయ్ ప్రభునే, వాసు ఇంటూరి, ఎలెనా టుటేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.