Upasana Egg Freezing: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెల తన అండాలను ఫ్రీజ్ చేయించడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. పెళ్లి, అమ్మతనం, ఇతర అంశాలపైనా ఆమె స్పందించింది. మసూమ్ మీనావాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.
కెరీర్లో బిజీగా ఉండే చాలా మంది మహిళల ఈ మధ్యకాలంలో తమ అండాలను ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అమ్మ కావాలనుకున్న సమయంలో వాటిని తిరిగి ఉపయోగించుకుంటున్నారు. ఉపాసన కూడా అదే పని చేసింది. ఆమె అభిప్రాయం మేరకు అండం ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం అంటే మహిళలకు ఓ ఇన్సూరెన్స్ పాలసీలాంటిదేనట. అండం ఫ్రీజ్ చేయడంపై అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.
“ఆ నిర్ణయం కఠినమైనదేమీ కాదు. అండాన్ని ఫ్రీజ్ చేసే ప్రక్రియ కష్టం కాదు. ఇది కేవలం సంతానం కోసమే అతని భావిస్తుంటారు. కానీ భద్రత కోసం కూడా దాచుకోవచ్చు. ఇదొక ఇన్సూరెన్స్ పాలసీలాంటిదే. ఓ మహిళ తనకు తాను ఇచ్చుకునే ఓ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది. తన జీవితంలో ఎప్పుడు సంతానం కావాలనుకుంటుందో నిర్ణయించుకునే అవకాశం ఆమెకు దక్కుతుంది” అని ఉపాసన చెప్పింది.
పిల్లలను సాకేది మహిళలే కాబట్టి.. ఆ సంతానం ఎప్పుడు కావాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఆమెకే ఉంటుందన్నది ఉపాసన వాదన. ఈ నిర్ణయం తీసుకునే ముందు తన కుటుంబం నుంచి తనకు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు కాలేదని కూడా స్పష్టం చేసింది. “ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ కోసం నా కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్లే నేనీ నిర్ణయం తీసుకునేలా చేయడం నాకు ఆనందంగా అనిపించింది. కానీ కారా నాకు సహజంగానే జన్మించింది. ఇంకా సంతోషంగా ఉంది” అని ఉపాసన చెప్పింది.
మహిళలు వాళ్ల జీవితాలు, ఆర్థిక విషయాలను ఎలా చూసుకుంటారో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కూడా అంతేనని ఉపాసన అభిప్రాయపడింది. “ఈ అండాలతో సైన్స్ ఎంతో చేస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని నిల్వ చేసి పెట్టుకుంటే మంచిది. నేను సైన్స్ ను నమ్ముతాను. నా అండాలను నిల్వ చేయడానికి నాకున్న అడ్డంకేంటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ విషయంలో సమాజం గురించి నేను పెద్దగా పట్టించుకోను” అని ఉపాసన తెలిపింది.
సంబంధిత కథనం