Ram Charan Team Clarity On Unfollow Thaman S: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ రెండోసారి జంటగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించారు.
అయితే, ఎన్నో అంచనాలతో జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అనేక రకాలుగా ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఎస్ తమన్ అందించిన సంగీతం నుంచి పాటలు, కథ వరకు ప్రతిదీ మెచ్చుకోతగినట్లుగా లేదనే విమర్శలు వచ్చాయి.
అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాటల ఫెయిల్యూర్‌కు కొరియోగ్రాఫర్, హీరోనే కారణం అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తమన్‌పై కోపంగా ఉన్నారు. సరిగ్గా ట్యూన్స్ కొట్టకుండా ఇతరులపైకి నెట్టేయడం ఏంటీ అని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దాంతో గేమ్ ఛేంజర్ పాటలు ఇండస్ట్రీలో రాద్ధాంతం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తమన్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో అయ్యాడని పుకార్లు షికార్లు చేయడం ప్రారంభమైంది. తమన్ ఇంటర్వ్యూ వీడియోను, రామ్ చరణ్ అకౌంట్ స్క్రీన్ షాట్‌కు అటాచ్ చేస్తూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. "ఈ కామెంట్స్ తర్వాత నుంచే తమన్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో అయ్యాడు" అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఆ నెటిజన్.
దాంతో ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ గింగిరాలు తిరిగింది. అది చూసిన నెటిజన్స్, కొంతమంది అభిమానులు నిజంగానే తమన్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో అయ్యాడని అభిప్రాయపడ్డారు. దీంతో తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ టీమ్ క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో తమన్‌ను చెర్రీ అన్‌ఫాలో అయ్యాడనేది నిజం కాదని, ఎందుకుంటే ఆయనను ఎక్స్ లేదా, ఇన్‌స్టా గ్రామ్‌లో ఎప్పుడూ ఫాలో కాలేదని హిందూస్తాన్ టైమ్స్‌కు రామ్ చరణ్ టీమ్ వెల్లడించింది.
ఎక్స్, ఇన్‌స్టా గ్రామ్ రెండింట్లో చాలా తక్కువ మందిని రామ్ చరణ్ ఫాలో అవుతారని, వారిలో ఎక్కువమంది ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని, ఇది కేవలం పుకార్లు తప్ప మరొకటి కాదని గ్లోబల్ స్టార్ బృందం స్పష్టం చేసింది. మరి రామ్ చరణ్ మూవీ టీమ్ ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్‌కు చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ పాటలు హిట్ కాకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో తమన్ చేసిన కామెంట్స్ ఈ వివాదానికి దారితీశాయి. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాటలు యూట్యూబ్‌లో ఎదుకు వైరల్ అవుతాయో, దేనికి కావో చెప్పుకొచ్చాడు.
"ఇదంతా కేవలం ఒక్క సంగీత దర్శకుడు వల్ల మాత్రమే కాదని నేనెప్పుడు నమ్ముతాను. నేను 25 మిలియన్ వ్యూస్ రాబట్టగలను కానీ, ఆ తర్వాత అవి రీల్స్‌లో క్లిక్ అవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్‌లోఅది మిస్ అయ్యాను. అదంతా డ్యాన్స్ మాస్టర్ బాధ్యత తీసుకోవాలి. హీరో కూడా. ఏ ఒక్క పాటకు హుక్ (మంచి) స్టెప్ లేదు. నువ్ సరిగ్గా చేస్తే కెమెరామ్యాన్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేస్తాడు" అని తమన్ అన్నాడు.
దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తమన్‌పై కోపం పెంచుకున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందు ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3లో కొరియోగ్రఫీపై ప్రశంసలు కురిపించిన తమన్ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటా అని అయోమయానికి గురయ్యారు.
ఆ ఇంటర్వ్యూలో జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలను ప్రత్యేకంగా విమర్శించిన తమన్ ఇండియన్ ఐడల్‌లో మాట్లాడుతూ.. "పాటల విజువల్స్ నేను చూశాను. చాలా బాగున్నాయి. మేము ఇంకా హుక్ స్టెప్ రిలీజ్ చేయలేదు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అది ఒక అందమైన వైబ్" అని తమన్ పేర్కొనడం గమనార్హం.
సంబంధిత కథనం