Ram Charan Waltair Veerayya Success Meet: నాన్న క్వైట్‌గా ఉంటారేమో ... మేము ఉండం - రామ్ చరణ్ వార్నింగ్ ఎవరికి?
Ram Charan Waltair Veerayya Success Meet: వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్‌లో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తోన్న వారికి రామ్‌చరణ్ వార్నింగ్ ఇచ్చాడు. నాన్న సౌమ్యంగా ఉంటారేమో కానీ ఆయన వెనుక ఉండే తాము మాత్రం సైలెంట్‌గా ఉండబోమని రామ్‌చరణ్ పేర్కొన్నాడు. అతడి కామెంట్స్ టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి.
Ram Charan Waltair Veerayya Success Meet: చిరంజీవిపై విమర్శలు చేస్తోన్న వారిపై వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్‌లో రామ్‌చరణ్ వార్నింగ్ ఇచ్చాడు. నాన్న సౌమ్యంగా ఉంటారేమో కానీ ఆయన వెనకాల ఉండే మేము మాత్రం సెలైంట్‌గా ఉండబోమని రామ్‌చరణ్ అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
వీరయ్య విజయ విహారం పేరుతో శనివారం వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్‌ను వరంగల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్ హాజరయ్యాడు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ ఈ సక్సెస్ మీట్‌కు తాను చీఫ్ గెస్ట్‌గా రాలేదని, నాన్నగారి వేలాదిమంది అభిమానుల్లో ఒకడిగా ఈ వేడుకకు వచ్చినట్లు రామ్‌చరణ్ పేర్కొన్నాడు.
అమెరికా నుంచి రాగానే వాల్తేర్ వీరయ్య సినిమా చూశానని రామ్‌చరణ్ అన్నాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను దర్శకుడు బాబీ అద్భుతంగా తెరకెక్కించాడని రామ్‌చరణ్ పేర్కొన్నాడు. సినిమాలో చిరంజీవిని చూస్తుంటే నాన్నలా కాకుండా బ్రదర్‌లా కనిపించారని రామ్‌చరణ్ పేర్కొన్నాడు.
వాల్తేర్ వీరయ్య ద్వారా నాన్నగారితో పాటు ఆయన అభిమానులందరికి గుర్తుండిపోయే సినిమాను డైరెక్టర్ బాబీ ఇచ్చాడని పేర్కొన్నారు.
నాన్నగారిని ఏదైనా అనగలిగే అధికారం ఫ్యామిలీ, ఫ్యాన్స్ కు మాత్రమే ఉంది. నాన్న చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇన్ని వేల మంది వేడుకకు వచ్చారు. ఆయన బిగించి గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందనేది ఇతరులకు తెలియదు. నాన్న సౌమ్యంగా ఉంటాడేమో కానీ ఆయన వెనకాల ఉండే మేము మాత్రం క్వైట్‌గా ఉండబోమని చరణ్ ఈ సక్సెస్‌మీట్‌లో అన్నాడు.
ఆయనకు తమ్ముళ్లు అంటే ఎంతో ప్రేమ అని చరణ్ ఈ వేడుకలో పేర్కొన్నాడు. అతడి మాటలను బట్టి చూస్తే చిరంజీవితో పాటు పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేస్తోన్న వారిని ఉద్దేశించే చరణ్ ఈ కామెంట్స్ చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.