Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్-ram charan shares a cute picture of himself with his daughter klin kara on the sets of rc16 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్

Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్

Hari Prasad S HT Telugu
Feb 05, 2025 10:17 PM IST

Ram Charan Guest: రామ్ చరణ్ మూవీ ఆర్సీ16 సెట్లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఆ గెస్టును చరణే ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఈ క్యూట్ ఫొటోను చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ లో బుధవారం (ఫిబ్రవరి 5) రాత్రి షేర్ చేశాడు.

రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్
రామ్ చరణ్ మూవీ సెట్‌లో స్పెషల్ గెస్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా.. ఉపాసన క్యూట్ కామెంట్

Ram Charan Guest: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా ఆర్సీ16. ఇంకా టైటిల్ పెట్టిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్లోకి బుధవారం (ఫిబ్రవరి 5) ఓ స్పెషల్ గెస్ట్ వచ్చింది. ఆ గెస్ట్ ఎవరో కాదు.. చరణ్ ముద్దుల తనయ క్లిన్ కారా. తన కూతురిని ఎత్తుకొని వచ్చిన చరణ్.. గెస్ట్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయింది.

yearly horoscope entry point

రామ్ చరణ్ సెట్లోకి స్పెషల్ గెస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఏమీ ఉండడు. ఎప్పుడో ఓసారిగానీ అతని ఇన్‌స్టాలో మనకు పోస్టులు కనిపించవు. కానీ బుధవారం (ఫిబ్రవరి 5) సడెన్ గా చరణ్ చేసిన ఓ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

"సెట్‌లో నా చిన్న అతిథి #RC16" అనే క్యాప్షన్ తో చెర్రీ ఓ పోస్ట్ చేశాడు. అందులో రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాను ఎత్తుకొని కనిపించాడు. తండ్రీకూతుళ్లు ముద్దుముద్దుగా ఏదో మాట్లాడుతుండటం ఆ ఫొటోలో చూడొచ్చు. మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన ఓ ఎగ్జిబిషన్ సెట్‌లా అది కనిపిస్తోంది.

ఈ ఫొటోకు ఉపాసన కామినేని కొణిదెల కామెంట్ చేసింది. FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అని ఆమె ఓ ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. అటు అభిమానులు కూడా ఈ ఫొటోపై స్పందిస్తూ కామెంట్స్ చేశారు. జై చరణ్, జై జై చరణ్ అంటూ వాళ్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పదేళ్ల తర్వాత క్లిన్ కారా పుట్టిన విషయం తెలిసిందే. ఆమె జూన్ 20, 2023లో జన్మించింది. ఆమె తన పేరుతోనే పాపులర్ అయిపోయింది. క్లిన్ కారా అనే పేరు వినగానే అసలు దానికి అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా మంది ఇంటర్నెట్ లో వెతికారు.

ఆర్సీ16 మూవీ గురించి..

ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది.

మరోవైపు చరణ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ ఆర్సీ16 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర తర్వాత ఆమె నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ మెగా హిట్ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ డిజాస్టర్లతో ఢీలా పడిన రామ్ చరణ్.. ఈ ఆర్సీ16పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం