Game Changer Live Updates: అప్పుడు బాబాయ్‌...ఇప్పుడు అబ్బాయ్ - క‌లిసిరాని డేట్‌-ram charan shankar game changer movie live updates review and collections kiara advani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Live Updates: అప్పుడు బాబాయ్‌...ఇప్పుడు అబ్బాయ్ - క‌లిసిరాని డేట్‌

గేమ్ ఛేంజ‌ర్

Game Changer Live Updates: అప్పుడు బాబాయ్‌...ఇప్పుడు అబ్బాయ్ - క‌లిసిరాని డేట్‌

07:03 AM ISTJan 10, 2025 12:33 PM Nelki Naresh Kumar
  • Share on Facebook
07:03 AM IST

రామ్‌చ‌ర‌ణ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి మూడేళ్లు దాటిపోయింది. గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల‌ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ నేడు ఈ మూవీ ఐదు భాష‌ల్లో రిలీజైంది. రామ్‌చ‌ర‌ణ్‌కు ఆర్ఆర్ఆర్ కు మించిన స‌క్సెస్ గేమ్ ఛేంజ‌ర్‌తో ద‌క్కిందా? శంక‌ర్‌ క‌మ్ బ్యాక్ ఇచ్చాడా? లేదా? అంటే..

Fri, 10 Jan 202507:03 AM IST

క‌లిసి రాని డేట్‌...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి 2018 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ కూడా జ‌న‌వ‌రి 10న సంక్రాంతికి ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించింది. అప్పుడు బాబాయ్‌కి...ఇప్పుడు అబ్బాయ్‌కి ఈ డేట్ క‌లిసిరాలేద‌ని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతోన్నారు.

Fri, 10 Jan 202506:22 AM IST

ఆన్‌లైన్‌లో గేమ్ ఛేంజ‌ర్ మూవీ లీక్‌

థియేట‌ర్ల‌లో రిలీజై కొద్ది గంట‌లు కాక‌ముందే గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ మూవీ పైర‌సీ వెర్ష‌న్స్ ప‌లు సైట్ల‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Fri, 10 Jan 202506:08 AM IST

గేమ్ ఛేంజ‌ర్ మూవీ చూసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్లు...

గేమ్ ఛేంజ‌ర్ మూవీని టాలీవుడ్ డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, బుచ్చిబాబుతో పాటు వ‌శిష్ట అభిమానుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లోని శ్రీరాములు థియేట‌ర్‌లో చూశారు.

Fri, 10 Jan 202505:45 AM IST

తొలిరోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

తొలిరోజు గేమ్ ఛేంజ‌ర్ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్‌గా 110 కోట్ల నుంచి 120 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఓవ‌ర్‌సీస్‌తో క‌లిపి అడ్వాన్స్ బుకింగ్స రూపంలోనే యాభై కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ క‌లుపుకొని 120 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రావ‌చ్చున‌ని అంటున్నారు.

Fri, 10 Jan 202505:14 AM IST

6600 స్క్రీన్స్‌...

వ‌ర‌ల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజ‌ర్ మూవీ 6600 స్క్రీన్స్‌లో రిలీజైంది. పుష్ప 2 త‌ర్వాత తెలుగులో హ‌య్యెస్ట్ స్క్రీన్స్‌లో రిలీజైన మూవీగా గేమ్ ఛేంజ‌ర్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Fri, 10 Jan 202505:06 AM IST

శంక‌ర్‌ను ఆటాడుకుంటున్న నెటిజ‌న్లు - ట్రోల్స్ మీమ్స్ వైర‌ల్‌

గేమ్ ఛేంజ‌ర్ మూవీకి మిక్స్‌డ్‌ టాక్ వ‌స్తోంది. ముఖ్యంగా శంక‌ర్‌ను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. శంక‌ర్ ఔట్‌డేటెడ్ అయ్యాడ‌ని, నిర్మాత‌ల‌తో అన‌వ‌స‌రంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టించ‌డంలో శంక‌ర్ లెవెల్ వేరు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్‌, ట్రోల్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

Fri, 10 Jan 202504:36 AM IST

బ్రేక్ కానీ రాజ‌మౌళి సెంటిమెంట్‌

గేమ్ ఛేంజ‌ర్‌తో రాజ‌మౌళి సెంటిమెంట్‌ను రామ్‌చ‌ర‌ణ్ బ్రేక్ చేయ‌లేక‌పోయాడ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. రాజ‌మౌళితో ఏ హీరో సినిమా చేసినా అత‌డి త‌దుప‌రి మూవీ డిజాస్ట‌ర్ అవుతూ వ‌స్తోంది. మ‌రోసారి గేమ్ ఛేంజ‌ర్‌తో ఆ సెంటిమెంట్ రిపీటైంద‌ని చెబుతోన్నారు.

Fri, 10 Jan 202504:32 AM IST

పాట‌ల కోస‌మే 75 కోట్ల ఖ‌ర్చు...

గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలోని పాట‌ల కోస‌మే 75 కోట్ల ఖ‌ర్చు పెట్టిన‌ట్లు దిల్‌రాజు తెలిపాడు. ఒక్కో పాట‌ను ఒక్కో కంట్రీలో షూట్ చేసిన‌ట్లు తెలిపాడు. అయితే థియేట‌ర్ల‌లో నానా హైరానా సాంగ్ స్క్రీనింగ్ కాక‌పోవ‌డంతో అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్నారు.

Fri, 10 Jan 202504:20 AM IST

ఫ్యాన్స్‌తో క‌లిసి గేమ్ ఛేంజ‌ర్ చూసిన దిల్‌రాజు

గేమ్ ఛేంజ‌ర్ మూవీని ఫ్యాన్స్‌తో క‌లిసి దిల్‌రాజు చూశారు. రామ్‌చ‌ర‌ణ్, ఎస్‌జే సూర్య‌సీన్స్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నార‌ని, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆడియెన్స్‌ను మెప్పిస్తుంద‌ని దిల్ రాజు అన్నాడు.

Fri, 10 Jan 202504:04 AM IST

నో టికెట్‌...నో ఎంట్రీ...థియేట‌ర్ల ముందు పోలీసుల‌ హెచ్చ‌రిక‌లు

రిలీజ్ రోజు ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్‌, హంగామాల‌పై తెలంగాణ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. క్రాక‌ర్స్ కాల్చ‌డం, పోస్ట‌ర్స్ , క‌టౌట్ పెట్ట‌డం లాంటివాటిపై నిషేదం విధించారు.టికెట్ లేని వారిని థియేట‌ర్ల‌లోకి అనుతించ‌డం లేదు. నో టికెట్ నో ఎంట్రీ పేరుతో పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డులు థియేట‌ర్ల ముందు క‌నిపిస్తోన్నాయి.

Fri, 10 Jan 202503:38 AM IST

ఫ్యాన్స్ హంగామా

ఇదివ‌ర‌కు స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ ఫ్యాన్స్ హంగామాతో ద‌ద్ద‌రిల్లిపోయేది. కానీ పుష్ప 2 ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట కార‌ణంగా ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. దాంతో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పెద్ద‌గా జోష్ క‌నిపించ‌లేదు.

Fri, 10 Jan 202503:34 AM IST

రామ్ చ‌ర‌ణ్ రెమ్యూన‌రేష‌న్‌...

గేమ్ ఛేంజ‌ర్ కోసం రామ్ చ‌ర‌ణ్ 65 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. శంక‌ర్ ఈ మూవీ కోసం 35 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

Fri, 10 Jan 202503:07 AM IST

రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో సెకండ్ మూవీ...

గేమ్ ఛేంజ‌ర్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 220 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ 122 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావ‌లంటే 222 కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన మూవీగా గేమ్ ఛేంజ‌ర్ నిలిచింది.

Fri, 10 Jan 202502:31 AM IST

పుష్ప 2 క‌లెక్ష‌న్స్‌ను దాటుతుందా?

పుష్ప 2 మూవీ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 175 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మొద‌టిరోజు తెలుగు వెర్ష‌న్ 95 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా...హిందీ వెర్ష‌న్‌కు 67 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. పుష్ప 2 క‌లెక్ష‌న్స్‌ను గేమ్ ఛేంజ‌ర్ దాట‌డం అనుమాన‌మేన‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

Fri, 10 Jan 202502:16 AM IST

మిక్స్‌డ్ టాక్‌...

గేమ్ ఛేంజ‌ర్ మూవీకి సోష‌ల్ మీడియాలో మాత్రం మిక్స్‌డ్ టాక్ క‌నిపిస్తోంది. మూవీలో శంక‌ర్ ట‌చ్ చేసిన పొలిటిక‌ల్ పాయింట్‌లో కొత్త‌ద‌నం లేద‌ని అంటున్నారు. రామ్‌చ‌రణ్‌, కియారా ల‌వ్ ట్రాక్ బోరింగ్‌గా ఉంద‌ని చెబుతోన్నారు. గేమ్ ఓవ‌ర్ అంటూ ట్వీట్స్ చేస్తోన్నారు.

Fri, 10 Jan 202502:13 AM IST

శంక‌ర్ క‌మ్ బ్యాక్ మూవీ

గేమ్ ఛేంజ‌ర్ మూవీతో డైరెక్ట‌ర్‌గా శంక‌ర్ కమ్ బ్యాక్ ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఊర మాస్‌గా ఉన్నాయ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌, సెకండాప్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉన్నాయ‌ని అంటున్నారు.

Fri, 10 Jan 202502:04 AM IST

గేమ్ ఛేంజ‌ర్ అడ్వాన్స్‌బుకింగ్స్‌

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గేమ్ ఛేంజ‌ర్ ఇర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ 16 కోట్ల వ‌ర‌కు ఉండ‌గా...హిందీ బుకింగ్స్ 2.14 కోట్ల వ‌ర‌కు జ‌రిగాయి. త‌మిళ వెర్ష‌న్‌కు అడ్వాన్ బుకింగ్స్ రూపంలో 54 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌చ్చాయి.

Fri, 10 Jan 202501:53 AM IST

పొలిటిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

గేమ్ ఛేంజ‌ర్ మూవీని పొలిటిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించారు. సీఏం సీటు కోసం జ‌రిగే కుట్ర‌లు, రాజ‌కీయాల్లోని ఎత్తుగ‌డ‌ల‌ను ఆవిష్క‌రిస్తూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించారు. గేమ్ ఛేంజ‌ర్ మూవీకి త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ క‌థ‌ను అందించారు.

Fri, 10 Jan 202501:36 AM IST

అప్ప‌న్న‌గా రామ్ చ‌ర‌ణ్‌...

గేమ్ ఛేంజ‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ యాక్టింగ్ అద్భుత‌మంటూ నెటిజ‌న్లు చెబుతోన్నారు. అప్ప‌న్న‌గా, రామ్ నంద‌న్‌గా రెండు పాత్ర‌ల్లో అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. అప్ప‌న్న పాత్ర రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని చెబుతోన్నారు.

Fri, 10 Jan 202501:26 AM IST

కెరీర్‌లో హ‌య్యెస్ట్‌..

గేమ్ ఛేంజ‌ర్ మూవీ తొలిరోజు 70 నుంచి 90 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు శంక‌ర్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

Fri, 10 Jan 202501:17 AM IST

నానా హైరానా సాంగ్ మిస్‌...

టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా నానా హైరానా సాంగ్‌ను గేమ్ ఛేంజ‌ర్ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డంతో అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు. ఈ పాట‌ను జ‌న‌వ‌రి 14 నుంచి సినిమాకు జోడించి స్క్రీనింగ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Fri, 10 Jan 202501:05 AM IST

గేమ్‌ఛేంజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. వంద కోట్ల‌కుపైనే ఓటీటీ డీల్ కుదిరిన‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు వారాల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం.