Ram Charan on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా గురించి లెటర్ రిలీజ్ చేసిన రామ్‍చరణ్
Ram Charan on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాపై లెటర్ రిలీజ్ చేశారు రామ్‍చరణ్. సంక్రాంతి పండుగ రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రస్తావించారు.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్.. జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. శంకర్ దర్శకత్వంలో సంక్రాంతి బరిలోకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ రేంజ్‍లో రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. కాగా, గేమ్ ఛేంజర్ మూవీపై నేడు (జనవరి 14) ఓ లెటర్ రిలీజ్ చేశారు రామ్‍చరణ్. ఈ మూవీకి వస్తున్న స్పందనపై సంక్రాంతి పండుగ రోజున రెస్పాండ్ అయ్యారు.

థ్యాంక్స్ చెబుతూ..
అభిమానులు, ప్రేక్షకులు, మీడియాకు అంటూ లెటర్ రాశారు రామ్‍చరణ్. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. “గేమ్ ఛేంజర్ కోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సినిమా సక్సెస్‍లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు.. వెనుక ఉన్న ప్రతీ ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. మీ ప్రేమ, మద్దతు నాపై ఎప్పుడూ ఉన్నాయి. రివ్యూలు, ప్రోత్సాహాన్ని ఇచ్చిన మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్” అని లెటర్‌లో పేర్కొన్నారు చరణ్.
గర్వించే పర్ఫార్మెన్స్‌లు ఇస్తా..
గర్వంగా ఫీలయ్యేలా మంచి పర్ఫార్మెన్సులు కొనసాగిస్తానని రామ్‍చరణ్ తెలిపారు. “2025కు పాాజిటివ్‍గా స్వాగతం చెప్పాం. మీరు గర్వించేలా పర్ఫార్మెన్స్‌లు చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా. గేమ్ ఛేంజర్ చిత్రానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీ ప్రేమకు థ్యాంక్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అద్భుతమైన సంత్సరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని లెటర్‌లో పేర్కొన్నారు రామ్‍చరణ్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌కు బిగ్ థ్యాంక్స్ అంటూ క్యాప్షన్ రాశారు.
గేమ్ ఛేంజర్‌ర్‌తు తొలి రోజు రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. అయితే, మిశ్రమ స్పందన వస్తుండటంతో ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. అయితే, తొలి రోజు కలెక్షన్ల లెక్కపై రచ్చే జరిగింది. కలెక్షన్లను మూవీ టీమ్ ఎక్కవ చేసి చూపించిందనే ఆరోపణలను కొందరు చేశారు. సీనియర్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ.. ఈ నంబర్ గురించి సైటైరికల్ ట్వీట్స్ చేశారు. అబద్ధం అంటూ రాసుకొచ్చారు.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍నందన్, అప్పన్న అనే రెండు పాత్రలను రామ్‍చరణ్ పోషించారు. అప్పన్నగా ఆయన నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వానీ ఫీమేల్ లీడ్స్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య విలన్‍గా మెప్పించారు. శ్రీకాంత్, సముత్రఖని, సునీల్, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించిన విధానంపై మిశ్రమ స్పందన వస్తోంది. దిల్‍రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం
టాపిక్