Game Changer: శంకర్‌‌ని మిస్ అవుతున్నాం.. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న రామ్ చరణ్‌-ram charan praises director shankar in game changer teaser release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: శంకర్‌‌ని మిస్ అవుతున్నాం.. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న రామ్ చరణ్‌

Game Changer: శంకర్‌‌ని మిస్ అవుతున్నాం.. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న రామ్ చరణ్‌

Galeti Rajendra HT Telugu
Nov 09, 2024 08:01 PM IST

Ram Charan On Director Shankar: లక్నోలో ఈరోజు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. కానీ.. డైరెక్టర్ శంకర్ మాత్రం ఈ ఈవెంట్‌కి వెళ్లలేకపోయాడు. దానికి కారణం చెప్పిన రామ్ చరణ్.. డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు.

శంకర్, కియారా అద్వానీ, రామ్ చరణ్
శంకర్, కియారా అద్వానీ, రామ్ చరణ్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, దిగ్గజ దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ శనివారం లక్నోలో జరిగింది. భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతోంది.

మూవీ టీజ‌ర్‌ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌ శంకర్ గారిని ఈరోజు ఈ ఈవెంట్‌లో మిస్ అవుతున్నాం. ఆయన చెన్నైలో మూవీ ఫైనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. ఇండియాలో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా పెద్దవి. నా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఇక్కడ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘‘మీరు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా టీజర్‌ను మాత్రమే చూశారు. కానీ అసలు సినిమా ముందుంది. ఈ రోజు శంకర్ కూడా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ ఎడిటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కలిసి చేసిన ఈ చిత్రం సంక్రాంతికి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరోయిన్ కియారా అద్వానీ మాట్లాడుతూ ‘‘లక్నోలో మా చిత్ర ప్రయాణం ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడకు రావాలని చాలా రోజుల నుంచి ఎదురు చూశాను. శంకర్ గారి వల్ల ఈ రోజు మేం ఇక్కడకు వచ్చాం. రామ్ చరణ్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో ఒక రోల్ చేసిన హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్‌లో నా పాత్ర విని వెంటనే ఓకే చెప్పాను. చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ మూవీ ఒప్పుకోవడానికి రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కూడా కారణం. సంక్రాంతికి ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’’ అని సూచించింది.

 

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్షన్‌లో ఇది 50వ సినిమా. శంకర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. పైగా రామ్ చరణ్‌తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

Whats_app_banner