Ram Charan Peddi Movie Glimpse Released: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో క్రేజీ డైరెక్టర్ బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్నచిత్రం ‘పెద్ది’. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగానే ఇవాళ (ఏప్రిల్ 6) శ్రీరామ నవమి సందర్భంగా తాజాగా పెద్ది గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది. గ్లింప్స్ ప్రారంభంలో చుట్టూ జనాలు అరుస్తూ ఉంటారు. ఆ అరుపుల మధ్యలోనుంచి రామ్ చరణ్ మాస్ అవతార్ లుక్‌లో నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు.
బ్యాక్‌గ్రౌండ్‌లో "ఒకటే పని చేసేనాకి.. ఒకేనాగా బతికేదానికేనా.. ఇంతపెద్ద బతుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయ్యాలా.. పుడతామా ఏంటీ మళ్లీ.." అని రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పే డైలాగ్ అదిరిపోయింది. గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. దీనికి స్పెషల్ అట్రాక్షన్‌గా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ అనిపించింది. వీర మాస్ లెవెల్‌లో, ఆడియెన్స్ విజిల్స్ వేసేలా గ్లింప్స్ ఉంది.
అంతేకాకుండా గ్లింప్స్ చివరిలో రామ్ చరణ్ బ్యాట్ పట్టే కొట్టే షాట్ ఒక రేంజ్‌లో ఉంది. ఇక మెగా అభిమానులకు కన్నుల పండుగగా గ్లింప్స్ ఉంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర ఎంత మాసీగా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. వీర లెవెల్ మాస్ లుక్‌లో పొగ ఊదుతు రామ్ చరణ్ ఇచ్చిన ఎంట్రీ క్రేజీగా ఉంది.
ఇప్పుడే రిలీజ్ అయిన రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇదిలా ఉంటే, డైరెక్టర్ బుచ్చిబాబు సాన-రామ్ చరణ్ కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కుతోన్న సినిమా పెద్ది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయి.
అంతేకాకుండా పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో జాన్వీ కపూర్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ యాక్టర్ దివ్యేందు శర్మ వంటి ఒక్కో ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఒక్క సినిమాకు వర్క్ చేయడంతో పెద్ది సినిమా ట్రెండ్ అవుతోంది.
సంబంధిత కథనం