Ram Charan New Look: కొత్త సినిమా కోసం లుక్ పూర్తిగా మార్చేసిన రామ్ చరణ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Ram Charan New Look: డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా కోసం రామ్‍చరణ్ లుక్ పూర్తిగా మార్చేశారు. చరణ్ కొత్త లుక్‍తో కనిపించారు. అభిమానులకు ఇది తెగనచ్చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూడేళ్ల నుంచి షూటింగ్ సాగుతున్న ఈ మూవీ ఇంకా విడుదల తేదీని ఖరారు చేసుకోలేదు. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌లో మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్‍రాజు చెబుతున్నా.. ఇంకా నమ్మకం లేని పరిస్థితి ఉంది. కాగా, రామ్‍చరణ్ తదుపరి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో సినిమా (RC16) చేయనున్నారు.
రామ్‍చరణ్ రగెడ్ లుక్
రామ్‍చరణ్ గుబురు గడ్డంతో రగెడ్ లుక్‍లోకి మారిపోయారు. జుట్టు కూడా బాగానే పెంచారు. కండలు కూడా ఎక్కువగా పెంచుకున్నట్టు అర్థమవుతోంది. బుచ్చిబాబుతో చేసే సినిమాలో మల్లయోధుడిగా చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే ఇలా రగెడ్ లుక్‍కు మారారు.
దర్శకుడు వీవీ వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయనకు బొకే ఇచ్చిన చరణ్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంట్లో రామ్‍చరణ్ గడ్డంతో నయా మాస్ రగెడ్ లుక్‍లో కనిపించారు.
సూపర్ ట్రాన్స్‌ఫర్‌మేషన్
గేమ్ ఛేంజర్ సినిమాలో క్లీన్ షేవ్‍తో క్లాసీ లుక్‍తో రామ్‍చరణ్ ఉన్నారు. ఆ మూవీలో ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో కండలు కూడా తక్కువగానే ఉండేలా క్లాస్‍గా ఉన్నారు. అయితే, బుచ్చిబాబులో మూవీ కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్‌మేషన్ అయ్యారు చరణ్. కండలు పెంచేందుకు తీవ్రంగా వర్కౌట్లు చేస్తున్నారు. మాస్ లుక్ కోసం గడ్డం పెంచేశారు. మల్లయోధుడి లుక్‍కు వచ్చేశారు.
అభిమానుల సంతోషం
రామ్‍చరణ్ కొత్త లుక్ చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిబాబుతో మూవీ చెర్రీకి ల్యాండ్‍మార్క్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇంత త్వరగా బాడీని పెంచడం వెనుక ఎంత కష్టపడ్డారో అర్థమవుతోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా రామ్ చరణ్ నయా లుక్‍తో ఫాన్స్ ఆనందంతో ఉన్నారు.
ఆర్‌సీ 16 మూవీలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ టీజర్ కోసం..
గేమ్ ఛేంజర్ టీజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. దసరా సందర్భంగా టీజర్ వస్తుందని ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పడంతో ఖుషి అయ్యారు. అయితే, దసరాకు టీజర్ వచ్చే అవకాశాలు లేవని థమన్ అప్‍డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రిలీజ్ డేట్ అయినా ప్రకటించొచ్చు కదా అంటూ మేకర్లను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్‍పై మేకర్స్ ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. డిసెంబర్‌లో తీసుకొస్తామని నిర్మాత దిల్‍రాజు చెబుతున్నా.. సంక్రాంతిని కూడా పరిశీలిస్తున్నారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఖరారవుతుందో చూడాలి.
టాపిక్