Ram Charan Net Worth: వందల కోట్లల్లో రామ్ చరణ్ ఆస్తులు.. సినిమాలు కాకుండా ఇతర బిజినెస్‌లతో ఎలా సంపాదించాడో తెలుసా?
Game Changer Actor Ram Charan Net Worth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. కానీ, ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నికర ఆస్తి విలువ ఇదేనంటూ బాలీవుడ్ మీడియా చెబుతోంది.
Ram Charan Net Worth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు తెలుగు రాష్ట్రా్ల్లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇటీవల సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు చెర్రీ.
జనవరి 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో రావడం లేదు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ నికర ఆస్తి విలువ అంటూ బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురించింది. రామ్ చరణ్ హీరోగా కాకుండా నిర్మాతగా కూడా అనేక సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్ నెట్ వర్త్
హీరోగా నటించి, నిర్మాతగా సినిమాలు నిర్మించిన రామ్ చరణ్ పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కూడా సంపాదిస్తున్నాడు. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం రామ్ చరణ్ నికర ఆస్తి విలువ రూ .1,370 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, సక్సెస్‌ఫుల్ బ్రాండ్స్‌తో రామ్ చరణ్‌కు వచ్చే ఆదాయం ఇలా ఉంటుందని పేర్కొంది.
రామ్ చరణ్ వ్యూహాత్మకంగా బిజినెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ప్రొడక్షన్ హౌజ్, పోలో క్లబ్, స్టార్టప్స్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అయితే, రామ్ చరణ్ డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.
రామ్ చరణ్ నడుపుతున్న కంపెనీలు:
హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్: రామ్ చరణ్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. 2011లో హీరోగా సక్సెస్ అయిన తర్వాత రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌లో తన సొంత పోలో జట్టును ప్రారంభించాడు. ఇది తన అభిరుచితో స్టార్ట్ చేశాడు.
కొణిదెల ప్రొడక్షన్:
2016లో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్‌లో ఖైదీ నంబర్ 150 (2017), సైరా నరసింహారెడ్డి (2019), ఆచార్య (2022) వంటి సినిమాలను నిర్మించారు. వీటిలో ఆచార్య మినహా మిగతా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకున్నాయి.
వి మెగా పిక్చర్స్:
ఇక 2023లో యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించాడు రామ్ చరణ్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో ప్రొడక్షన్ హౌస్ తన మొదటి ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్ మూవీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
రామ్ చరణ్‌కు చెందిన బ్రాండ్లు:
టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్: 2013లో రామ్ చరణ్ వంకాయలపాటి ఉమేష్ ప్రమోటర్‌గా హైదరాబాద్ కేంద్రంగా టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రాంతీయ విమానయాన సంస్థను స్థాపించారు. రెండేళ్ల తర్వాత దాని పేరును ట్రూజెట్‌గా మార్చారు. అయితే 2022 ఫిబ్రవరిలో ప్రాంతీయ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
డెవిల్స్ సర్క్యూట్:
జిక్యూ రిపోర్ట్ ప్రకారం డెవిల్స్ సర్క్యూట్ అనే అడ్వెంచర్ ట్రిప్స్ చేసే సిరీస్‌కు రామ్ చరణ్ సహ యజమాని. దేశంలోనే తొలిసారిగా డెవిల్స్ సర్క్యూట్‌ను మారుతి సుజుకి స్పాన్సర్ చేస్తోంది. మిలటరీలో శిక్షణ ఇచ్చే తరహాలో 5 కిలోమీటర్ల పొడవుతో ఈ అడ్వెంచర్ సర్క్యూట్ ఉంటుంది.
2017లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వ్లాగ్‌ను షేర్ చేశారు. అయితే, రామ్ చరణ్ భార్య ఉపాసన తాత ప్రతాప్ చంద్రారెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ హాస్పిటల్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) వైస్ చైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల ఉన్నారు.
సంబంధిత కథనం