Game Changer: ఆర్ఆర్ఆర్ కంటే గేమ్ ఛేంజర్ మూవీకి డబుల్ కలెక్షన్లు: బాలీవుడ్ స్టార్ హీరో.. కవిత చెప్పిన రామ్‍చరణ్: వీడియో-ram charan game changer will do double business than rrr says salman khan in bigg boss 18 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: ఆర్ఆర్ఆర్ కంటే గేమ్ ఛేంజర్ మూవీకి డబుల్ కలెక్షన్లు: బాలీవుడ్ స్టార్ హీరో.. కవిత చెప్పిన రామ్‍చరణ్: వీడియో

Game Changer: ఆర్ఆర్ఆర్ కంటే గేమ్ ఛేంజర్ మూవీకి డబుల్ కలెక్షన్లు: బాలీవుడ్ స్టార్ హీరో.. కవిత చెప్పిన రామ్‍చరణ్: వీడియో

Game Changer - Salman Khan: ఆర్ఆర్ఆర్ చిత్రం కంటే గేమ్ ఛేంజర్ చిత్రం రెట్టింపు బిజినెస్ చేస్తుందనేలా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. రామ్‍చరణ్‍కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ వివరాలు ఇవే..

Game Changer: ఆర్ఆర్ఆర్ కంటే గేమ్ ఛేంజర్ మూవీకి డబుల్ కలెక్షన్లు: బాలీవుడ్ స్టార్ హీరో.. కవిత చెప్పిన రామ్‍చరణ్: వీడియో

గేమ్ ఛేంజర్ సినిమా గ్రాండ్ రిలీజ్‍కు రెడీ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి వీక్‍లో మరో నాలుగు రోజుల్లో జనవరి 10వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో చరణ్ చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో హిందీలోనూ గేమ్ ఛేంజర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ టీమ్ కూడా అదే రేంజ్‍లో భారీగా ప్రమోషన్లను చేస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‍బాగ్ 18 రియాల్టీ షోకు గెస్ట్‌గా వెళ్లారు రామ్‍చరణ్, హీరోయిన్ కియారా అడ్వానీ.

ఆర్ఆర్ఆర్ కంటే డబుల్

ఐదేళ్ల తర్వాత తన సోలో సినిమా వస్తోందని సల్మాన్ ఖాన్‍తో రామ్‍చరణ్ చెప్పారు. వినయ విధేయరామ (2019) తర్వాత చెర్రీ చేసిన సోలో మూవీ గేమ్ ఛేంజరే. 2022లో ఆర్ఆర్ఆర్ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ చిత్రంలో హీరోగా నటించారు. అందుకే ఐదేళ్ల తర్వాత తన సోలో మూవీ వస్తోందని చెర్రీ అన్నారు. దీంతో సల్మాన్ ధైర్యం చెప్పారు. “సోలో సినిమా అయినా ఆర్ఆర్ఆర్ కంటే డబుల్ బిజినెస్ చేస్తుంది” అని సల్మాన్ చెప్పారు. రెట్టింపు కలెక్షన్లు సాధిస్తుంటూ మాట్లాడారు. దీంతో థాంక్యూ అంటూ నమస్కరించారు చరణ్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సుమారు రూ.1,400కోట్ల కలెక్షన్లను దక్కించుకోవడంతో పాటు గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయింది.

సల్మాన్‍పై కవిత చెప్పిన చరణ్

సల్మాన్ ఖాన్ గురించి హిందీలో ఓ కవిత చెప్పారు రామ్‍చరణ్. వీకెండ్‍ వచ్చేసిందని, సల్మాన్ మాటలను వినేందుకు అందరూ ఎదురుచూస్తున్నారని కవిత చెప్పారు. ఇండియా మొత్తం నుంచి ప్రేమను పొందుతున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సల్మాన్ అని అన్నారు. దీంతో కియారా కూడా వావ్ అని అన్నారు. సల్మాన్ థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య మంచి రిలేషన్, గౌరవం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

సికిందర్ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నానని రామ్‍చరణ్ చెప్పారు. దీంతో ఈ ఈద్‍కు వస్తుందని సల్మాన్ చెప్పారు. సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించారు. ఈ మూవీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి, సల్మాన్ ఖాన్‍కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. చిరూ హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ క్యామియో రోల్ చేశారు. సల్మాన్ హీరోగా చేసిన కిసీ కా భాయ్ కిసి కీ జాన్ చిత్రంలోని ఓ పాటలో రామ్‍చరణ్ కనిపించారు.

గేమ్ ఛేంజర్ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచింది. ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అడ్వానీ, అంజలీ ఫీమేల్ లీడ్స్ చేశారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీకి థమన్ సంగీతం అందించారు.

సంబంధిత కథనం