Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ - రామ్‌చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ - శంకర్ మార్కు మూవీ
Game Changer Twitter Review: రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కలయికలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న (నేడు) పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Game Changer Twitter Review: రామ్‌చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మూడేళ్ల విరామం అనంతరం రామ్‌చరణ్ నటించిన మూవీ ఇది. దర్శకుడు శంకర్ తెలుగులో చేసిన ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ కూడా ఇదే కావడంతో ఆరంభం నుంచే పాన్ ఇండియన్ లెవెల్‌లో గేమ్ ఛేంజర్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉంది? రామ్ చరణ్‌కు దర్శకుడు శంకర్ హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే?
శంకర్ మార్కు మూవీ...
గేమ్ ఛేంజర్...పొలిటికల్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన శంకర్ మార్కు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ అని నెటిజన్లు చెబుతోన్నారు. అప్పన్నగా, ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ అదరగొట్టేశాడని అంటున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో అప్పన్న క్యారెక్టర్స్‌కు సంబంధించి వచ్చే సీన్స్‌లో రామ్‌చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు.
సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్...
ఎంగేజింగ్ స్టోరీ, నటీనటులందరి అద్భతమైన యాక్టింగ్, టాప్ నాచ్ టెక్నికల్ వాల్యూస్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను గేమ్ ఛేంజర్ మూవీ అందిస్తుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ మూవీలోని సాంగ్స్ బిగ్‌స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
ఇంటర్వెల్ ఎపిసోడ్...
ఫస్ట్ హాఫ్‌లో చరణ్ ఇంట్రడక్షన్‌తో పాటు ధూప్ సాంగ్, బీజీఎమ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటాయని, సెకండాఫ్‌లో ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుందని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
శంకర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్‌ప్లేతో గేమ్ ఛేంజర్ సాగుతుందని, డైరెక్టర్‌గా ఆయన కమ్‌బ్యాక్ మూవీగా గేమ్ ఛేంజర్ నిలుస్తుందని అంటున్నారు. కామెడీ, పొలిటికల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని, బొమ్మ బ్లాక్‌బస్టర్ అని పేర్కొంటున్నారు.
లవ్ ట్రాక్ బోర్...
తమన్ మ్యూజిక్, పాటలు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయని అంటున్నారు.రామ్‌చరణ్, కియారా అద్వానీ లవ్ ట్రాక్ మాత్రం బోరింగ్‌గా ఉందని ఓ నెటిజన్ అన్నాడు. అప్పన్న పాత్ర బాగున్నా...ఐఏఎస్ ఆఫీసర్ రోల్‌ను పవర్‌ఫుల్‌గా శంకర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయలేకపోయాడని చెబుతోన్నారు. గేమ్ ఛేంజర్‌లో టచ్ చేసిన పొలిటికల్ పాయింట్ కొత్తదేమి కాదని, ఈ పాయింట్‌తో ఇది వరకు దక్షిణాదిలో పలు సినిమాలు వచ్చాయని మరో నెటిజన్ పేర్కొన్నాడు.