Game Changer: దీపావళినా… క్రిస్మస్‌కా...రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడంటే?
Game Changer: రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తోన్నాయి. రిలీజ్ డేట్ విషయంలో సెకండ్ ఆప్షన్‌గా క్రిస్మస్‌ను కూడా పరిశీలిస్తోన్నట్లు తెలిసింది.
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తోన్నారు. మేకర్స్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నది. రామ్‌చరణ్ క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం.

మిగిలిన నటీనటులపై కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు చెబుతోన్నారు. జూలైలో బ్యాలెన్స్‌గా ఉన్న పోర్షన్‌ను షూటింగ్‌ను కంప్లీట్ చేసిన తర్వాతే రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
దీపావళికి రిలీజ్...
దీపావళికి గేమ్‌ఛేంజర్‌ను రిలీజ్ చేయాలని ఫిక్సయినట్లు తెలిసింది. ఈ ఏడాది దీపావళి పండుగ బరిలో రామ్‌చరణ్ మూవీ నిలవడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో సెకండ్ ఆప్షన్‌గా క్రిస్మస్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. దాదాపుగా ఈ మూవీ దీపావళికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతోన్నారు.
దీపావళినే కరెక్ట్ డేట్ గా మేకర్స్ భావిస్తోన్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో దేవర, డిసెంబర్‌లో పుష్పతో పాటు స్టార్ హీరోలు నటించిన మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్‌లోనే గేమ్ ఛేంజర్‌ను విడుదల చేయాలని ఫిక్సైనట్లు సమాచారం. జూలైలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ...
గేమ్ ఛేంజర్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్నారు. తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాత దిల్‌రాజు గేమ్ ఛేంజర్ ప్రొడ్యూస్ చేస్తోన్నారు.
ఇండియన్ 2 కారణంగా...
2021లో గేమ్ ఛేంజర్ సినిమా మొదలైంది. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌తో పాటు ఇండియన్ 2 సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఒకేసారి చేస్తూ వచ్చారు శంకర్. ఇండియన్ 2 కారణంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమైంది.
వినయవిధేయరామ...
గేమ్ ఛేంజర్‌లో అంజలి, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, ఎస్‌జేసూర్యతో పాటు పలువురు తెలుగు, తమిళ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినయవిధేయరామ తర్వాత రామ్‌చరణ్ కియారా అద్వానీ రెండోసారి జంటగా నటిస్తోన్న మూవీ ఇది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తోన్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆగస్ట్‌లో...
గేమ్ ఛేంజర్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో రా అండ్ రస్టిక్ మూవీ చేయబోతున్నారు రామ్‌చరణ్. ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.