Game Changer OTT: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - శాటిలైట్ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌!-ram charan game changer ott rights bagged by amazon prime video and satellite partner fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Ott: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - శాటిలైట్ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌!

Game Changer OTT: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - శాటిలైట్ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Jan 10, 2025 01:26 PM IST

Game Changer OTT: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశాడు.

గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఓటీటీ
గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఓటీటీ

Game Changer OTT: రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు నుంచి ఎనిమిది వారాల త‌ర్వాత గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ హ‌క్క‌ల కోసం అమెజాన్ ప్రైమ్ వంద కోట్ల‌కుపైనే వెచ్చించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గేమ్ ఛేంజ‌ర్ శాటిలైట్ హ‌క్కుల‌ను జీ నెట్‌వ‌ర్క్ సొంతం చేసుకున్న‌ది.

yearly horoscope entry point

కియారా అద్వానీ...

గేమ్ ఛేంజ‌ర్ మూవీకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించింది. ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, న‌వీన్‌చంద్ర, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మిక్స్‌డ్ టాక్‌...

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న (నేడు) ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమాలో రామ్‌నంద‌న్‌, అప్ప‌న్న అనే రెండు పాత్ర‌ల్లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించాడు. ముఖ్య‌మంత్రికి, ఐఎస్ఎస్ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య పోరాటం నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ మూవీని తెర‌కెక్కించాడు.

రామ్ నంద‌న్‌...అప్ప‌న్న‌...

ఐపీఎస్ ఆఫీసర్ రామ్‍నందన్ (రామ్‍చరణ్).. సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అవుతాడు. అవినీతి ప‌రుల ఆట‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డం మొద‌లుపెడ‌తాడు. త‌న పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయితీగా ప‌నిచేయాల‌ని సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) ఆదేశాలు జారీ చేస్తాడు అప్పన్న (రామ్‍చరణ్)కు చేసిన అన్యాయం సీఏంను వెంటాడుతుంటుంది.

తండ్రిని అధికారంలో నుంచి దించి సీఏం సీటులో బొబ్బిలి మోపిదేవి (ఎస్‍జే సూర్య) కూర్చుంటాడు. త‌న అధికారంతో అక్ర‌మాలు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. సీఏం కుట్ర‌ల‌ను రామ్ నంద‌న్ ఎలా అడ్డుకున్నాడు? రామ్ నందన్ గతం ఏమిటి? అప్ప‌న్న‌తో అత‌డికి ఉన్న సంబంధ‌మేమిటి? అప్పన్న, పార్వతి (అంజలి) ఎలా చ‌నిపోయారు? దీపిక‌కు బ్రేక‌ప్ చెప్పిన రామ్ నంద‌న్ మ‌ళ్లీ ఆమెకు ఎందుకు ఎదురుప‌డాల్సివ‌చ్చింది అనే అంశాల‌తో గేమ్ ఛేంజర్ మూవీని శంక‌ర్ రూపొందించాడు.

నానా హైరానా పాట‌...

గేమ్ ఛేంజ‌ర్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ఈ సినిమాలోని నానా హైరానా పాట‌ను థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ చేయ‌డం లేద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 14 నుంచి పాట‌ను సినిమాలో యాడ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు. తొలిరోజు ఈ సినిమా వంద నుంచి నూట ఇర‌వై కోట్ల మ‌ధ్య క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

Whats_app_banner