Game Changer: గెట్ రెడీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అప్‍డేట్ వచ్చేస్తోంది! ఎప్పుడంటే..?
Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ అప్‍డేట్‍ను కూడా ఫిక్స్ చేసిందట యూనిట్. ఆ వివరాలు ఇవే.
గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆలస్యమవుతూనే ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉంది. అయితే, ఎప్పుడు విడుదలవుతుందనే టెన్షన్ ఇంకా ఉంది. అయితే, ఈ ఉత్కంఠకు తెరదించేందుకు మూవీ టీమ్ రెడీ అయిందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍ను ప్రకటించేందుకు సిద్ధమైందనే సమాచారం బయటికి వచ్చింది.
రిలీజ్ డేట్ ఇదే.. అప్‍డేట్ ఎప్పుడంటే..
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను ఈవారమే వినాయక చవితి పండుగ రోజున (సెప్టెంబర్ 7) ప్రకటించాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ పోస్టర్‌తో విడుదల తేదీని రివీల్ చేయనుందని టాక్. గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఈ డేట్‍తోనే పోస్టర్ రానుందట.
మరో నాలుగు రోజుల్లోనే సెప్టెంబర్ 7న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఈ అప్‍డేట్ కోసం రామ్‍చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు మూడేళ్లుగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది.
ఈనెలలోనే టీజర్
గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఓ టీజర్ ఈనెలలోనే రానుందని తెలుస్తోంది. ఈనెలాఖరులో టీజర్ రిలీజ్ చేసేలా మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తంగా చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న అప్‍డేట్లు ఈ మూవీ నుంచి వరుసగా వచ్చే అవకాశం ఉంది. ఈనెలలోనే రెండో పాటను తీసుకొచ్చే పనులు జరుగుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం తన షూటింగ్‍ను రామ్‍చరణ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. అయితే, రీషూట్లు ఉంటాయనే రూమర్లు వచ్చాయి. ఏదిఏమైనా క్రిస్మస్ సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్‍రాజు మరోసారి స్పష్టంగా చెప్పారు. దీంతో డిసెంబర్ 20నే యూనిట్ డిసైడ్ చేసిందని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాలో పొలిటికల్ పాయింట్ ఉన్నా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దిల్‍రాజు చెప్పారు. ఐదు పాటలతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని అన్నారు. ఈ మూవీలోని పాటలు విజువల్స్ ట్రీట్‍గా ఉంటాయని కూడా చెప్పారు. ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అవుతుందనే నమ్మకం తమకు పూర్తిగా ఉందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఐఏఎస్ అధికారి పాత్ర పోషించారు చరణ్. ఎన్నికల వ్యవస్థపై ఈ మూవీ ప్రధానంగా ఉంటుందని టాక్.
గేమ్ ఛేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సముద్రఖని, జయరాం, నాజర్, ప్రకాశ్ రాజ్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘జరగండి’ ఫస్ట్ సాంగ్ మెప్పించింది. రెండో సాంగ్ త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.