Game Changer OTT Streaming: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!-ram charan game changer movie ott streaming started on amazon prime video with no change in runtime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Ott Streaming: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!

Game Changer OTT Streaming: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 07, 2025 08:25 AM IST

Game Changer OTT Streaming: గేమ్ ఛేంజర్ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో రిలీజై నెల ముగియకుండానే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍ అవుతోంది.

Game Changer OTT: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!
Game Changer OTT: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!

గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్లాఫ్‍గా నిలిచింది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి రేసులో జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ రెస్పాన్ దక్కించుకొని పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఈ భారీ బడ్జెట్ చిత్రం. నేడు (ఫిబ్రవరి 7) గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

గేమ్ ఛేంజర్ చిత్రం నేడు (ఫిబ్రవరి 7) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది. అయితే, హిందీ వెర్షన్ రాలేదు. హిందీలో కాస్త ఆలస్యం కానుంది. మొత్తంగా నాలుగు భాషల్లో ఈ గేమ్ ఛేంజర్ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍ అవుతోంది.

రన్‍టైన్‍లో నో ఛేంజ్

గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఐదు గంటల వరకు ఫుటేజ్ వచ్చిందని డైరెక్టర్ శంకర్ గతంలో తెలిపారు. చాలా ట్రిమ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చామని అన్నారు. దీంతో థియేట్రికల్ వెర్షన్‍తో పోలిస్తే ఓటీటీలోకి అదనపు సీన్లతో ఏమైనా గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వస్తుందా అనే సందేహాలు వచ్చాయి. అయితే, రన్‍టైమ్‍లో ఏ మార్పు లేకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు ఈ మూవీ వచ్చింది. 2 గంటల 37 నిమిషాల నిడివితోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ చిత్రం సుమారు రూ.350కోట్లతో రూపొందిందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం రూ.200కోట్ల కలెక్షన్లను కూడా దాటలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టేసింది. రామ్‍చరణ్ యాక్టింగ్ మెప్పించినా.. ఈ మూవీని శంకర్ తెరకెక్కించిన తీరుపై మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది.

గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో రామ్‍చరణ్ డ్యుయల్ రోల్స్ చేశారు. కియారా అడ్వానీ, అంజలి ఫీమేల్ లీడ్స్‌గా నటించారు. ఈ మూవీలో ఎస్‍జే సూర్య మెయిన్ విలన్‍గా చేయగా.. శ్రీకాంత్, సముద్రఖని, సునీల్, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

గేమ్ ఛేంజర్ సినిమాను పొలిటికల్ పాయింట్‍తో యాక్షన్ డ్రామా శంకర్ తెరకెక్కించారు. అయితే, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. పాటలు గ్రాండ్‍గా ఉన్నా.. సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. దీంతో కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం