Game Changer Records: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇవే.. అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం సేఫ్?-ram charan game changer movie need to break these records collection on day 1 but difficult to beat allu arjun pushpa 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Records: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇవే.. అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం సేఫ్?

Game Changer Records: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇవే.. అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం సేఫ్?

Sanjiv Kumar HT Telugu

Ram Charan Game Changer Need To Break These Records: రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ అయింది. దీంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇవే.. అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం సేఫ్?

Ram Charan Game Changer Need To Break These Records: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రెస్టిజీయస్ మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన గేమ్ ఛేంజర్‌కు తమన్ మ్యూజిక్ అందించాడు.

టాప్ 3 తెలుగు మూవీ ట్రైలర్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాలతో జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్, అది బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటీ అనే వివరాలు ఆసక్తిగా మారాయి. అయితే, ఇదివరకు రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ 24 గంటల్లో 36.24 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ 3 టాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ వ్యూస్

మొదటి రెండు స్థానాల్లో వరుసగా పుష్ప 2 ది రూల్ (44.67 మిలియన్ వ్యూస్), గుంటూరు కారం (37.68 మిలియన్ వ్యూస్) ఉన్నాయి. అయితే, గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు వారం రోజుల్లో 57 మిలియన్ వ్యూస్ రాగా ముందు ముందు అవి పెరిగే అవకాశం ఉంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్

ఇక రూ. 400 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ కాగా వరల్డ్ వైడ్‌గా రూ. 221 కోట్లుగా నమోదు అయింది. అంటే, ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమా రూ. 222 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 425 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే బాక్సాఫీస్ పరంగా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. లేకుంటే ప్లాప్‌గా మిగిలిపోతుంది.

నైజాం కలెక్షన్స్ రికార్డ్

మెగా హీరోలకు తెలంగాణలోని నైజాంలో మంచి క్రేజ్ ఉంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ సినిమాలకు ఇక్కడ మంచి వసూళ్లు వస్తాయి. దాంతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు కూడా నైజాం ఏరియాలో భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నైజాంలో గేమ్ ఛేంజర్ రూ. 43.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కాబట్టి ఈ కలెక్షన్స్‌కు మించిన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

పుష్ప 2 రికార్డ్

ఇక ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీకి నైజాం ఏరియాలో రూ. 103.62 కోట్లు వచ్చాయి. మరి ఈ కలెక్షన్స్‌ను గేమ్ ఛేంజర్ దాటుతుందో చూడాలి. ఇక స్టార్ హీరోలు అంటే బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టారనే టాపిక్ ఎక్కువగా నడుస్తుంది. ఇదివరకు ఆర్ఆర్ఆర్ (రూ. 223 కోట్లు), బాహుబలి 2 (217 కోట్లు) సినిమాలు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన భారతీయ సినిమాలుగా ఉండేవి.

గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్

కానీ, రీసెంట్‌గా ఈ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పుష్ప 2 తొలి రోజున రూ. 294 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఓపెనింగ్ డే నాడు పుష్ప 2 రికార్డ్‌ను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కానీ, గేమ్ ఛేంజర్‌కు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ. 120 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన పుష్ప 2తోపాటు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డ్స్ కూడా సేఫే అని తెలుస్తోంది.

మూడింట్లో ఒక్కటైనా

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు పుష్ప 2 రూ. 63.29 కోట్లు, హిందీలో రూ. 72 కోట్లు రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ రికార్డ్స్‌ను కూడా గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తేనే తొలి స్థానంలోకి వెళ్తుంది. లేదా, ఏపీ, తెలంగాణలో రూ. 54.08 కోట్లతో రెండో స్థానంలో నిలిచిన దేవర, రూ. 38.09 కోట్లతో మూడో స్థానంలో ఉన్న కల్కి 2898 ఏడీ రికార్డ్‌ను అయిన గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది.

పుష్ప 2 సేఫ్

అయితే, తెలంగాణలో పుష్ప 2కి ఇచ్చినంతగా బెన్‌ఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు గేమ్ ఛేంజర్‌కి ఇవ్వలేదు. ఇది రామ్ చరణ్ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. దాంతో ఒక్క ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్‌తో గేమ్ ఛేంజర్ రికార్డ్స్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఏ రికార్డ్ బ్రేక్ చేసిన మొదటి స్థానంలో ఉన్న పుష్ప 2ని దాటేయడం చాలా కష్టమని తెలుస్తోంది. దాంతో పుష్ప 2 రికార్డ్స్ మాత్రం పదిలంగా ఉంటాయని ఊహించొచ్చు.

సంబంధిత కథనం