గేమ్ ఛేంజర్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍కు నిరాశను మిగిల్చింది. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, గేమ్ ఛేంజర్ మూవీ హిందీ వెర్షన్ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది.
గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ వెర్షన్ మాత్రం నెల ఆలస్యంగా మార్చి 7వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది. జీ5లో గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్‍కు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.
గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ 250 మిలియన్ వాచ్ మినిట్స్ దాటిందని జీ5 ఓటీటీ నేడు (మార్చి 26) ప్రకటించింది. గేమ్‍ఛేంజ్ చేసిందంటూ ఓ పోస్టర్ ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది. మొత్తంగా హిందీలో గేమ్ ఛేంజర్ మంచి దూకుడు చూపిస్తోంది.
గేమ్ ఛేంజర్ చిత్రం ప్రైమ్ వీడియోలోనూ మోస్తరుగా వ్యూస్ దక్కించుకుంది. కొన్ని రోజులు టాప్‍లో ట్రెండ్ అయింది. అయితే, జీ5లో హిందీలో మాత్రం అంచనాలకు మించి వ్యూస్ దక్కాయి. ఈ మూవీ జీ5లో ఇంకా ట్రెండింగ్‍లో కొనసాగుతోంది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ రెండు పాత్రలు చేశారు. ఏఐఎస్ రామ్‍నందన్ పాత్రతో పాటు అప్పన్న క్యారెక్టర్ చేశారు. ఈ మూవీ కమర్షియల్‍గా ప్లాఫ్ అయినా చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. అప్పన్న పాత్రలో యాక్టింగ్ ప్రేక్షకులను మరింత మెప్పించింది. ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, సునీల్, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు.
గేమ్ ఛేంజర్ మూవీని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించటంలో డైరెక్టర్ శంకర్ విఫలయ్యారు. దీంతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ వాటిని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. పాటలు కూడా ఎక్కువగా పాపులర్ కాలేదు. అయితే, సరైన హుక్ స్టెప్స్ లేని కారణంగా ఈ చిత్రంలోని పాటలకు ఎక్కువ వ్యూస్ దక్కలేదంటూ ఇటీవల వివాదాస్పద కామెంట్ చేశారు తమన్.
గేమ్ ఛేంజర్ సినిమాను దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. సుమారు రూ.350కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్టు అంచనా. ఈ చిత్రం దాదాపు రూ.200కోట్ల వసూళ్లను దక్కించుకుంది. దీంతో డిజాస్టర్‌గా నిలిచింది.
రామ్‍చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో ఓ మూవీ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ చిత్రంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే హైప్ చాలా ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
సంబంధిత కథనం