Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవర డేట్‌కు థియేటర్లలోకి వస్తోన్న గేమ్‌ఛేంజర్
Game Changer Release Date: ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కావడం అనుమానమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డేట్‌కు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి.
Game Changer Release Date: టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ తారుమారు కావడం కామన్ అయిపోయింది. అనౌన్స్ చేసిన డేట్‌కు అగ్ర హీరోల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అంటే మిరాకిల్‌గా మారిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి సినిమాలు వాయిదాపడ్డాయి.
అక్టోబర్ 10న దేవర...
ఎన్టీఆర్ దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా లాంఛింగ్ రోజే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ గాయపడటం, షూటింగ్ ఆలస్యం కావడంతో దేవర రిలీజ్ వాయిదాపడింది. ఏప్రిల్ 5న కాకుండా దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ డేట్‌కు కూడా దేవర రావడం అనుమానమేనని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10న దేవర కాకుండా రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌లో కొత్త పుకార్లు షికారు చేస్తోన్నాయి.
కారణం అదే...
దేవర షూటింగ్ చాలా భాగం మిగిలివున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయినా అక్టోబర్ 10లోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే అక్టోబర్ 10న కూడా దేవర ప్రేక్షకుల ముందుకు రావడం లేదని అంటున్నారు. దేవర పోస్ట్‌పోన్ కావడం ఖాయమైతే ఆ రిలీజ్ డేట్‌ను రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ పుకార్లపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జాన్వీకపూర్ హీరోయిన్...
ఎన్టీఆర్ దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర మూవీతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో కళ్యాణ్‌రామ్‌తో కలిసి కోసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. దేవర మూవీ రెండు పార్ట్‌లుగా రూపొందుతోంది.
గేమ్ ఛేంజర్ రిలీజ్...
గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 150 కోట్లతో పాన్ ఇండియన్ మూవీగా దిల్‌రాజు గేమ్ ఛేంజర్‌ను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నలభై ఐదు రోజుల టాకీపార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం. జూలై నెలాఖరులోగా షూటింగ్ గేమ్ ఛేంజర్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్...
దేవర తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తోన్నాడు. మరోవైపు గేమ్‌ఛేంజర్ పూర్తయిన వెంటనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేయబోతున్నట్లు మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు రామ్‌చరణ్. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీమేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.