Ram Charan: ఓటు వేయడానికి షూటింగ్‌కు బ్రేక్.. హైదరాబాద్ వచ్చిన రామ్ చరణ్
Ram Charan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అతడు మైసూర్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అతడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడం విశేషం. తెలంగాణలో గురువారం (నవంబర్ 30) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
మైసూర్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో ఎక్కుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. @TweetRamCharan అనే హ్యాండిల్లో ఈ వీడియోను చెర్రీ అభిమానులు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చరణ్ ప్రైవేట్ విమానం దగ్గరికి నడుచుకుంటూ రావడం చూడొచ్చు. అతని వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
అయితే అక్కడి ఎయిర్ పోర్టు సిబ్బందితో చరణ్ ఫొటోలకు పోజులివ్వడం విశేషం. బిజీగా ఉన్నా కూడా వాళ్ల కోరికను ఈ మెగా హీరో కాదనలేకపోయాడు. రామ్ చరణ్ ఎన్నికల్లో హైదరాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ మైసూరులో శరవేగంగా జరుగుతోంది. అయితే బిజీ షెడ్యూల్ కావడంతో చరణ్ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ వచ్చి ఓటు వేసిన తర్వాత తిరిగి వెళ్లి షూటింగ్ లో పాల్గొననున్నాడు.
గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఎన్నో కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ మధ్యే మైసూరులో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే దేశ ఎన్నికల వ్యవస్థ చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న సినిమా ఈ గేమ్ ఛేంజర్. దీంతో తన ఓటు హక్కు వినియోగించుకొని అభిమానులకు ఓ ఉదాహరణగా నిలవాలని చరణ్ భావించాడు.
శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. శంకర్ ఓవైపు ఇండియన్ 2 షూటింగ్ చేస్తూనే గేమ్ ఛేంజర్ నూ తెరకెక్కిస్తున్నాడు. సామాజిక అంశాలపై ఎన్నో సందేశాత్మక సినిమాలు తీసిన శంకర్.. ఈసారి ఎన్నికల వ్యవస్థపై గేమ్ ఛేంజర్ తీయబోతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.