Game Changer Song: టెన్షన్‍లో రామ్‍చరణ్ ఫ్యాన్స్.. అప్‍డేట్ కోసం ఎదురుచూపులు-ram charan fans waiting for update on jaragandi song from game changer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Fans Waiting For Update On Jaragandi Song From Game Changer

Game Changer Song: టెన్షన్‍లో రామ్‍చరణ్ ఫ్యాన్స్.. అప్‍డేట్ కోసం ఎదురుచూపులు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2023 08:08 PM IST

Game Changer first Song - Jaragandi: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దీపావళికి తొలి సాంగ్ తీసుకొస్తామని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు టెన్షన్‍లో పెట్టారు.

Game Changer Song: టెన్షన్‍లో రామ్‍చరణ్ ఫ్యాన్స్.. అప్‍డేట్ కోసం ఎదురుచూపులు
Game Changer Song: టెన్షన్‍లో రామ్‍చరణ్ ఫ్యాన్స్.. అప్‍డేట్ కోసం ఎదురుచూపులు

Game Changer first Song - Jaragandi: మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై హైప్ మామూలుగా లేదు. తనకు గ్లోబల్ స్టార్ రేంజ్ తెచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది. అందులోనూ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘జరగండి’ అనే ఫస్ట్ సాంగ్‍ను దీపావళికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించటంతో రామ్‍చరణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ తరుణంలో అభిమానులను మూవీ యూనిట్ టెన్షన్ పెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి పాటను తీసుకొస్తామని మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. అయితే, దీపావళి(నవంబర్ 12)కి మరో రెండు రోజుల సమయమే ఉన్నా.. పాట గురించి ఏ అప్‍డేట్ ఇవ్వలేదు మూవీ యూనిట్. కనీసం ఇప్పటి వరకు ప్రోమోను తీసుకురాలేదు. పాట రిలీజ్ డేట్, టైమ్‍ను కూడా ప్రకటించలేదు. దీంతో రామ్‍చరణ్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పాట గురించిన అప్‍డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

అసలు గేమ్ ఛేంజర్ నుంచి తొలి పాట దీపావళికే వస్తుందా లేదా ఆలస్యమవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్‍ను రామ్‍చరణ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో జరగండి పాట ఇక దీపావళికి రావడం కష్టమేనని పోస్టులు పెడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ జరగండి పాట గురించి ఎప్పుడు అప్‍డేట్ ఇస్తుందో చూడాలి.

గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను సరిగమ సంస్థ దక్కించుకుందని ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది. ‘జరగండి’ అనే తొలిపాటను దీపావళికి తీసుకురానున్నట్టు పేర్కొంది.

డైరెక్టర్ శంకర్.. ఇండియన్-2 మూవీ కూడా చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరామ్, సునీల్ కీలకపాత్రలు చేస్తున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.