Ramcharan G20 Summit: కొరియన్ అంబాసిడర్‌తో రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పలు - వీడియో వైరల్
Ramcharan G20 Summit: జీ20 సమ్మిట్‌లో కొరియన్ అంబాసిడర్ చాంక్ జే బొక్‌తో కలిసి రామ్‌చరణ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ramcharan G20 Summit: కశ్మీర్‌లో జరుగుతోన్న జీ20 సమ్మిట్‌కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సోమవారం ప్రసగించిన చరణ్ తండ్రి చిరంజీవిపై ప్రశంసలు కురిపించాడు.
తండ్రి దగ్గర నుంచే తాను క్రమశిక్షణను నేర్చుకున్నానని, 68 ఏళ్ల వయసులోనూ ఆయన ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడని చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాల్ని అంగీకరించాడని చరణ్ హింట్ ఇచ్చాడు.
అంతే కాకుండా తన హాలీవుడ్ సినిమాపై కూడా చరణ్ ఈ వేడుకలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాలో ఎన్నో బ్యూటీఫుల్ లొకేషన్స్ ఉన్నాయని, ఒకవేళ హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చినా ఆ సినిమా షూటింగ్ మొత్తం ఇండియాలోనే చేస్తానని అన్నాడు. ఈ జీ20 సమ్మిట్‌లో కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బొక్‌తో కలిసి వేదికగా నాటు నాటు పాటకు చరణ్ డ్యాన్స్ చేశాడు.
చాంగ్‌కు నాటు నాటు స్టెప్పులు నేర్పించాడు. చరణ్, చాంగ్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్ సినిమా చేస్తోన్నాడు శంకర్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని దిల్ రాజు నిర్మిస్తోన్నాడు. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుదర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీలో చరణ్ నటిస్తోన్నాడు.