RC16 Title Launch: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ టైటిల్ లాంచ్ ముహూర్తం ఫిక్స్.. ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తోంది
RC16 Title Launch: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఇది పండగలాంటి వార్తే. అతడు నటిస్తున్న ఆర్సీ16 మూవీ టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపే చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ఈ సర్‌ప్రైజ్ అందనుంది.
RC16 Title Launch: రామ్ చరణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. అతని పుట్టిన రోజున ఆర్సీ16 మేకర్స్ నుంచి ఏం అనౌన్స్‌మెంట్ వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు మొత్తానికి పండగలాంటి వార్త వస్తోంది. గురువారం (మార్చి 27) చరణ్ 40వ బర్త్ డే సందర్భంగా ఆర్సీ16 టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.
ఆర్సీ16 టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్
బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ఆర్సీ16. ఇందులో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గురువారం (మార్చి 27) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతోన్నారు. అయితే అంత వరకు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నాడు.
చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో రామ్ చరణ్ దర్శనం ఇవ్వనున్నాడు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించబోతోన్నారని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది.
ఆర్సీ16 గురించి..
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఎన్నడూ లేనివిధంగా మ్యాజిక్‌ను క్రియేట్ చేయటానికి మరోసారి తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ చిత్రాన్ని రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం "ఉప్పెన"తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఈ పాన్ ఇండియా సినిమాటిక్ వండర్‌ను పవర్‌హౌస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తూ నెక్ట్స్ రేంజ్ గ్రాండియర్ మూవీగా దీన్ని రూపొందించటానికి సుకుమార్ రైటింగ్స్ కూడా చేతులు కలిపింది. సినీ నిర్మాణ రంగంలోకి ఈ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో స్క్రీన్‌పై సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయనుంది వృద్ధి సినిమాస్.
ఆర్సీ16 మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రఖ్యాత నటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక దీనికి అకాడమీ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. అద్భుతమైన విజువల్స్‌ను ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అందిస్తున్నాడు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
సంబంధిత కథనం