Ram Charan 16th Movie Announcement: రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Ram Charan 16th Movie Announcement: రామ్‌చరణ్ (Ramcharan), దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
Ram Charan 16th Movie Announcement: రామ్‌చరణ్ 16వ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహించనున్నాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంపరాఫర్‌ను అందుకున్నాడు కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సమర్ఫణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించబోతున్నారు. కథానాయికతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తన 16వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్నట్లు రామ్‌చరణ్ ప్రకటించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అతడి స్థానంలో బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. మరోవైపు ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్‌తో (Ntr) సినిమా చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్ కమిట్‌మెంట్స్ ఉండటంతో రెండేళ్ల వరకు అతడి డేట్స్ దొరకడం కష్టమే. అందుకే రామ్‌చరణ్ సినిమాకు బుచ్చిబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన డెబ్యూ హీరో ఫిల్మ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.