RC 15 Title: రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్‌ను అందించి అతడి అభిమానులను ఖుషి చేశారు ఆర్‌సీ 15 టీమ్. సోమవారం ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమా కు గేమ్ ఛేంజర్ (Game changer) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. స్పెషల్ వీడియో ద్వారా టైటిల్‌ను రిలీజ్ చేశారు.
తొలుత ఈ సినిమాకు సీఈఓ, సర్కారోడు అనే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా గేమ్ ఛేంజర్ అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతోన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలో రాజకీయ వ్యవస్థలోని అవినీతిపై పోరాటం చేసే ఎలక్షన్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ కనిపించబోతున్నట్లు సమాచారం.
రామ్‌చరణ్, శంకర్ (Shankar) కలయికలో రూపొందుతోన్న తొలి సినిమా ఇది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్‌గా నటిస్తోంది. వినయవిధేయరామ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ఇది.
ఇటీవలే ప్రభుదేవా సారథ్యంలో హైదరాబాద్‌లో దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో ఓ పాటను చిత్రీకరించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.