Ram Charan: మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు గెస్ట్ హాఫ్ హానర్‌గా రామ్‌చరణ్ - తొలి ఇండియన్ హీరోగా రికార్డ్
Ram Charan: ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15వ ఎడిషన్‌కు గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డును గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందుకోనున్నాడు. ఈ అవార్డును అందుకోనున్న తొలి ఇండియన్ హీరోగా రామ్‌చరణ్ నిలవనున్నాడు.
Ram Charan: ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15వ ఎడిషన్‌కు గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డును గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందుకోనున్నాడు. ఈ విషయాన్ని ఐఎఫ్ఎఫ్ఎం అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. రామ్ చరణ్‌ను ఉద్దేశించి ఐఎఫ్ఎఫ్ఎం చేసి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అవార్డును అందుకోనున్న తొలి ఇండియన్ హీరోగా రామ్‌చరణ్ నిలవనున్నాడు.
మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ ఇండియన్ సినీ అవార్డులకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తన స్టార్ పవర్‌ను జోడించబోతున్నాడు. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ను ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఆగస్ట్ 15-25 వరకు జరుగనుంది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్...
ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. మరో పదిహేను రోజుల టాకీపార్ట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుపెట్టేందుకు శంకర్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది.
వినయవిధేయ రామ తర్వాత...
గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయవిధేయ రామ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు గేమ్ చేంజర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ఈ ఏడాది చివరలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్‌పై మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
ఆర్‌సీ 16 అప్‌డేట్
గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చేయనున్నాడు రామ్‌చరణ్. ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జన్వీకపూర్ కనిపించనుంది. దేవర తర్వాత తెలుగులో ఆమె అంగీకరించిన సెకండ్ మూవీ ఇది. ఇందులో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆర్‌సీ 16కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. ఇటీవలే ఎఆర్ రెహమాన్, కెమెరామెన్ రత్నవేలుతో దిగిన ఓ ఫొటోను ఇటీవలే డైరెక్టర్ పోస్ట్ చేశాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆర్‌సీ 16 పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.