Ram Charan in Dhoom 4: షారుక్ ఖాన్‌తో రామ్ చరణ్ ధూమ్ 4.. రికార్డులు బ్రేకే
Ram Charan in Dhoom 4: షారుక్ ఖాన్‌తో రామ్ చరణ్ ధూమ్ 4 మూవీ చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉంది కదా. ఇది నిజమయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
Ram Charan in Dhoom 4: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది కచ్చితంగా అభిమానులకు పండగే. పాన్ ఇండియా మూవీల కాలంలో నార్త్, సౌత్ స్టార్లు కలిసి చేస్తున్న సినిమాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షారుక్, చరణ్ కాంబినేషన్ ఊహకందనిది ఏమీ కాదు.
అయితే ఈ ఇద్దరు స్టార్లు ధూమ్ ఫ్రాంఛైజీ కోసం కలవబోతున్నారన్న వార్తే ఎంతో ఆసక్తి రేపుతోంది. ధూమ్ 4 మూవీ కోసం షారుక్ ఖాన్, రామ్ చరణ్ కలిసి నటించనున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ధూమ్ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలను రూపొందించగా అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటికే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు విలన్ల పాత్రలు పోషించారు. అయితే ఈ మూడు సినిమాల్లోనూ అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. కానీ ఇప్పుడు ధూమ్ 4 కోసం మాత్రం మరో హీరోను మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పోలీస్ పాత్ర కోసం రామ్ చరణ్ అయితే ఎలా ఉంటుందన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఇక విలన్ పాత్రలో షారుక్ ను ఊహించుకోవడమే కాదు.. అతని లుక్ ఎలా ఉంటుందో కూడా ఊహించి ఫొటోలు క్రియేట్ చేసేస్తున్నారు అభిమానులు. నార్త్, సౌత్ సూపర్ స్టార్లు అయిన ఈ ఇద్దరూ నిజంగానే కలిస్తే మాత్రం రికార్డులు బ్రేక్ అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది జవాన్, పఠాన్, డంకీలాంటి హిట్స్ ఇచ్చాడు షారుక్ ఖాన్. ఇక ప్రస్తుతం సుజయ్ ఘోష్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబుతో మరో మూవీ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే యశ్ రాజ్ ఫిల్మ్స్ అనౌన్స్ చేయబోతున్నారని భావిస్తున్న ధూమ్ 4లో అతడు నిజంగానే ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ కి షారుక్ ఖాన్ లక్కీ మస్కట్ గా మారడంతో ధూమ్ నెక్ట్స్ మూవీలో అతన్నే తీసుకోవాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నట్లు తెలుస్తోంది.