Operation Valentine: తెలుగులో రామ్‍చరణ్.. హిందీలో సల్మాన్ ఖాన్
Operation Valentine Trailer Release Date: ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు ముహూర్తం ఖరారైంది. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ట్రైలర్ రిలీజ్ టైమ్ కూడా ఫిక్స్ అయింది.

Operation Valentine Trailer: ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంపై చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే వైమానిక దాడి బ్యాక్‍డ్రాప్‍లో వస్తున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ మానుషి చిల్లర్ హీరోయిన్‍గా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీలో ద్విభాషా చిత్రంగా శక్తి ప్రతాప్ సింగ్ హడా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్, పాటలతో ఈ మూవీపై చాలా బజ్ ఉంది. ఈ తరుణంలో మూవీ ట్రైలర్ సిద్ధమైంది.
ట్రైలర్ డేట్, టైమ్
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ట్రైలర్ రేపు (ఫిబ్రవరి 20) ఉదయం 11 గంటల 5 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఫైనల్ స్ట్రైక్ పేరుతో ఈ ట్రైలర్ వస్తోంది. చాలా అంచనాలు పెట్టుకున్న ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1వ తేదీన తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
రామ్‍చరణ్, సల్మాన్ ఖాన్
ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కడంతో టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్ కూడా ఈ మూవీకి కీలకంగా ఉంది. అందుకే వరుణ్ తేజ్.. హిందీలోనే ఎక్కువగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా మూవీ టీమ్ లాంచ్ చేస్తోంది. రేపు ఉదయం 11.05 నిమిషాలకు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ను సల్మాన్ లాంచ్ చేయనున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెలుగు ట్రైలర్‌ను అదే సమయానికి గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారింగా నేడు వెల్లడించింది.
“ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నుంచి ఫైనల్ స్ట్రైక్‍ను గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్, భాయ్ సల్మాన్ ఖాన్ రేపు ఉదయం 11:05 గంటలకు లాంచ్ చేస్తారు” అని రెనైసెన్స్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.
ఇండియాపై ఉగ్రదాడి చేసిన పొరుగు దేశంపై భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఆధారంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కింది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు మూవీ టీమ్ ఇప్పటికే తెలిపింది.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల స్మారకం వద్దకు వెళ్లి ఇటీవల నివాళులు అర్పించారు వరుణ్ తేజ్. అంతకు ముందు ఈ సినిమా సాంగ్ ‘వందేమాతరం’ను వాఘా సరిహద్దు వద్ద మూవీ టీమ్ లాంచ్ చేసింది. భారత వైమానిక దళం చేసిన అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్ ఈ చిత్రంలో చూపిస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ కనిపించనున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్‌తో పాటు నవ్‍దీప్, రుహానీ శర్మ, మీర్ సర్వర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంతోనే శక్తిప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.