మైన‌పు బొమ్మ‌తో రామ్‌చ‌ర‌ణ్ ఫోజులు.. నాన్న అంటూ వెళ్లిన క్లీంకారా.. వ‌ద్ద‌న్న ఉపాస‌న‌.. క్యూట్ వీడియో వైర‌ల్‌-ram charam wax statue at madame tussauds klinkara goes to father cute video viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మైన‌పు బొమ్మ‌తో రామ్‌చ‌ర‌ణ్ ఫోజులు.. నాన్న అంటూ వెళ్లిన క్లీంకారా.. వ‌ద్ద‌న్న ఉపాస‌న‌.. క్యూట్ వీడియో వైర‌ల్‌

మైన‌పు బొమ్మ‌తో రామ్‌చ‌ర‌ణ్ ఫోజులు.. నాన్న అంటూ వెళ్లిన క్లీంకారా.. వ‌ద్ద‌న్న ఉపాస‌న‌.. క్యూట్ వీడియో వైర‌ల్‌

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మైనపు బొమ్మ కొలువుదీరనుంది. ఇటీవల లండన్ లో ఓ ఈవెంట్ లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార వీడియో ఒకటి వైరల్ గా మారింది.

రామ్ చరణ్ మైనపు బొమ్మతో చిరంజీవి ఫ్యామిలీ

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ లెవల్ లో పేరు తెచ్చుకున్నారు. గ్లోబల్ స్టార్ గా మారారు. ఈ నేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మను పెట్టనున్నారు. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈవెంట్ లో రామ్ చరణ్, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సహా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార వీడియో క్యూట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

అమ్మ పిలుస్తుంటే

క్లీంకార వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లండన్ లోని ఈవెంట్ లో తన మైనపు బొమ్మతో రామ్ చరణ్ ఫోజులిచ్చారు. అదే సమయంలో కింది నుంచి క్లీంకారా నాన్న దగ్గరికి వెళ్లింది. అమ్మ ఉపాసన ‘నో క్లీంకారా’ అంటూ పిలుస్తున్నా రామ్ చరణ్ దగ్గరకు ఆ పాప వెళ్లింది. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూసింది. అయితే ఈ వీడియలో క్లీంకార ఫొటో కనబడలేదు. ఇప్పుడీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్ హిస్టరీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిస్టరీ క్రియేట్ చేశారు. చేతిలో తన పెంపుడు కుక్క రైమ్ ను పట్టుకున్న రామ్ చరణ్ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ కోసం తీర్చిదిద్దారు. దీంతో క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత పెంపుడు జంతువుతో ఈ ఐకానిక్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ నిలిచారు. ఫస్ట్ యాక్టర్ ఆయనే.

మే 19 వరకు

2023 ఆస్కార్ వేడుక కోసం రామ్ చరణ్ వేసుకున్న నలుపు రంగు వెల్వెట్ డ్రెస్ లో ఉన్న ఫోజునే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కోసం రెడీ చేశారు. మే 19వ వరకు లండన్ లో రామ్ చరణ్ మైనపు బొమ్మను విజిటర్స్ కోసం ఉంచుతారు. ఆ తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.

పెద్దితో బిజీ

రామ్ చరణ్ తర్వాతి క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రూరల్ క్రికెట్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. రా అండ్ రస్టిక్ లుక్ లో రామ్ చరణ్ అదిరిపోయారు. ఊరమాస్ అవతారమెత్తారు.

మరోవైపు ఇటీవల లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం