Rakul Joined in Indian 2 Sets: ఇండియన్ 2 సెట్స్‌లో అడుగుపెట్టిన రకుల్-rakul preet singh joined kamal haasan indian 2 movie shooting set ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rakul Preet Singh Joined Kamal Haasan Indian 2 Movie Shooting Set

Rakul Joined in Indian 2 Sets: ఇండియన్ 2 సెట్స్‌లో అడుగుపెట్టిన రకుల్

Maragani Govardhan HT Telugu
Sep 04, 2022 11:12 AM IST

Rakul Joined in Indian 2 Sets: ఇండియన్ 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ (Girish Srivastav)

Rakul Joined in Inidan 2 Sets: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవనే చెప్పాలి. చివరగా ఈ ముద్దుగుమ్మ వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన కొండపొలం సినిమాలో కనిపించింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ ఏడాది ఎటాక్, రన్ వే 34, కల్ పుట్లీ లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. సౌత్‌లో ప్రస్తుతం కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని రకులే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.

ఇండియన్ 2 బిగిన్స్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. ఈ సినిమాతో సౌత్‌లో మళ్లీ పాగా వేయాలని రకుల్ భావిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

ఇండియన్ 2 చిత్రం ఎప్పుడో ప్రారంభం కాగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే ఈ ఏడాది కమల్ తను నటించిన విక్రమ్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రాన్ని తిరిగి త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనుకున్నట్లే ఇటీవలే ఇండియన్ 2 పునఃప్రారంభమైంది. కమల్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం నుంచి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. పీటర్ హెయిన్స్ స్టంట్లు రూపొందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం