Bhoo OTT Release Date: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న విశ్వక్‌సేన్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే
Bhoo OTT Release Date: రకుల్‌ప్రీత్‌సింగ్, విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ భూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే..
Bhoo OTT Release Date: రకుల్‌ప్రీత్‌సింగ్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ భూ థియేటర్లకు స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. జియో సినిమా ఓటీటీలో మే 27 నుంచి భూ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలో విడుదలకానున్న ఈ మూవీకి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ హారర్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్, నివేథా పేతురాజ్‌తో పాటు మేఘా ఆకాష్, మంజిమామోహన్, రెబ్బాజాన్ ఇతర ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దెయ్యాల కథలతో కూడిన బుక్‌ను ఓపెన్ చేసి చదివిన ఐదుగురు స్నేహితురాళ్లకు ఎదురైన పరిణామాలతో ట్రైలర్ థ్రిల్లింగ్‌గా సాగింది.
తొలుత ఈ సినిమాకు అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే పేరును ఖరారు చేశారు. తాజాగా ఈ టైటిల్‌ను ఛేంజ్ చేస్తూ భూ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా తాజాగా జియో సినిమా ఓటీటీ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళంలో మదరాసిపట్టణం, దైవతిరుమగల్, విజయ్ తలైవా, కంగనా రనౌత్ తలైవి సినిమాలో వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు విజయ్.
అతడు భూ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. భూ సినిమాను జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌రెడ్డి నిర్మించారు. విశ్వక్‌సేన్, రకుల్ ప్రీత్‌సింగ్ నటించిన ఫస్ట్ హారర్ మూవీ ఇదే కావడం విశేషం.