OTT Movie: ఓటీటీలోకి రకుల్‍ప్రీత్ డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!-rakul preet singh arjun kapoor mere husband ki biwi will be streaming on jiocinema ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: ఓటీటీలోకి రకుల్‍ప్రీత్ డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Movie: ఓటీటీలోకి రకుల్‍ప్రీత్ డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Movie: మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ కామెడీ మూవీ నిరాశపరిచింది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీకి రానుందో సమాచారం బయటికి వచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి రకుల్‍ప్రీత్ డిజాస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన మేరే హస్బెండ్‍ కీ బీవీ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. టైటిల్‍తోనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇంట్రెస్ట్ పెంచింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. ఈ మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు.

మేరే హస్బెండ్‍ కీ బీవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో డేట్ బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆ ఓటీటీలో ఏప్రిల్ 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. అయితే, జియోహాట్‍స్టార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏప్రిల్ 18నే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందనే బజ్ బలంగా ఉంది.

మేరే హస్బెండ్‍ కీ బీవీ చిత్రానికి దర్శకత్వం వహించారు ముదాసర్ అజీజ్. మాజీ భార్య, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి మధ్య సతమతమయ్యే యువకుడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది. అర్జున్, రుకుల్ ప్రీత్ సింగ్, భూమితో పాటు ఆదిత్య సీల్, డినో మోరియా, శక్తికపూర్, కవిత కపూర్, ముకేశ్ రిషి, కన్వలిజిత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు.

కలెక్షన్లు ఇలా..

బాక్సాఫీస్ వద్ద మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా బోల్తా కొట్టింది. సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందినట్టు అంచనా. అయితే, ఈ మూవీ మొత్తంగా దాదాపు రూ.13కోట్ల గ్రాస్ కలెక్షన్లే దక్కించుకుంది. భారీ డిజాస్టర్ అయింది. ప్రేక్షకులను మెప్పించలేక ఈ చిత్రం చతికిలపడింది.

మేరే హస్బెండ్‍ కీ బీవీ మూవీని పూజా ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై విష్ణు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షిక దేశ్‍ముఖ్ కలిసి నిర్మించారు. నిర్మాతలకు భారీ నష్టాలనే ఈ చిత్రం మిగిల్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

మేరే హస్బెండ్‍ కీ బీవీ స్టోరీలైన్

ప్రబ్లీన్ (భూమి పడ్నేకర్)తో అంకూర్ చద్ధా (అర్జున్ కపూర్) విడాకులు తీసుకుంటాడు. ఐదేళ్ల తర్వాత అంతారా (రకుల్ ప్రీత్ సింగ్)ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు. అయితే, ఓ ప్రమాదంలో ప్రబ్లీన్ గాయపడుతుంది. మెమరీ లాస్ అయి గత ఐదేళ్ల జ్ఞాపకాలను మరిచిపోతుంది. అంకూర్‌తో విడాకులు తీసుకున్న విషయం కూడా మరిచిపోయి.. ఇప్పటికీ అతడే తన భర్త అనుకుంటుంది.

దీంతో అంతారాతో పెళ్లికి సిద్ధమైన అంకూర్ జీవితంలోకి ప్రబ్లీన్ మళ్లీ వస్తుంది. దీంతో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అంకూర్ తికమకలో పడతాడు. ఇద్దరి మధ్య నలిగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అంకూర్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? మాజీ భార్యతో ఉండేందుకు మొగ్గుచూపాడా? అంతారాను పెళ్లి చేసుకున్నాడా? అనేవి మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమాలో ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం