Rakul Preet Singh Wedding: పెళ్లికి ముందు కాబోయే భర్తతో కలిసి ప్రముఖ ఆలయానికి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్: వీడియో
Rakul Preet Singh Jackky Bhagnani Wedding: పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. పెళ్లి పత్రికతో పూజలు చేసి దేవుడి ఆశీర్వాదాన్ని పొందారు. ఆ వివరాలివే..
Rakul Preet Singh Wedding: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గడియలు దగ్గరపడుతున్నాయి. తన బాయ్ ఫ్రెండ్, నటుడు జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకోనున్నారు. గోవాలో ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి బంధంతో రకుల్ - జాకీ ఒకటికానున్నారు. పెళ్లి పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వారిద్దరూ ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించారు.
రకుల్, జాకీ భగ్నానీ నేడు (ఫిబ్రవరి 17) సిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. పెళ్లి పత్రికను తీసుకెళ్లి దేవుడి ఆశీర్వాదం పొందారు. వారు దేవాలయంలోకి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. పింక్ అనార్కలీ డ్రెస్ ధరించి, స్టైలిష్ సన్ గ్రాసెస్ పెట్టుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ప్యారెట్ గ్రీన్ కుర్తా ధరించారు జాకీ.
పెళ్లి వేడుకలు..మూడు రోజులు..
దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో రకుల్ - జాకీ వివాహం గ్రాండ్‍గా జరగనుంది. 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. 21న పెళ్లి జరగనుంది. పెళ్లికి ముందు రెండు రోజులు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్దమైనట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఈ పెళ్లిని పర్యావరణ హితంగా చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయించుకున్నారు. ఈ వేడుకలో ఎలాంటి టపాసులు కాల్చకూడదని నిశ్చయించుకున్నారు. అలాగే, పేపర్ వేస్ట్ ఎక్కువగా కాకుండా డిజిటల్ రూపంలోనే ఇన్విటేషన్లు పంపుతున్నారు. వివాహం తర్వాత వారిద్దరూ మొక్కలు కూడా నాటనున్నారు. మొత్తంగా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకోనున్నారు.
రకుల్ - జాకీ వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. పింక్, బ్లూ కలర్ షేడ్లలో ఫ్లవర్స్ డిజైన్‍తో ఆకర్షణీయంగా ఉంది. అందమైన బీచ్‍లో వీరి వివాహం జరుగుతుందని తెలిపే థీమ్‍తో ఆకట్టుకుంది.
పెళ్లిని మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ముందుగా అనుకున్నారు. అయితే, భారత్‍లోనే వివాహాలు చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునివ్వడంతో వీరు కూడా దాన్ని ఫాలో అయ్యారు. గోవాలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐటీసీ గ్రాండ్ లగ్జరీ రిసార్టును పెళ్లి వేదికగా ఎంపిక చేసుకున్నారు.
రకుల్ ప్రీత్ - జాకీ రిలేషన్
రకుల్ - జాకీ ప్రేమ మూడేళ్ల కిందట మొదలైంది. స్నేహితుల ద్వారా పరిచయమైన ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. 2021 అక్టోబర్ 10వ తేదీన రకుల్ పుట్టిన రోజున తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు రకుల్, జాకీ. ఆ తర్వాతి నుంచి ఇద్దరూ కలిసే చాలా ఫంక్షన్‍లకు వెళ్లారు. జంటగా బయట కనిపించారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలను చాలాసార్లు సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటి కానున్నారు.
సినిమాలు ఇలా..
సినిమాల విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 చేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‍లో మేరీ పత్నీకా రీమేక్ అనే మరో చిత్రం చేస్తున్నారు రకుల్.