Rakshasa: టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్‌గా రాక్షస.. భయపెడుతున్న కూతురు ప్రేమ
Rakshasa Trailer Released In Telugu: తెలుగులోకి వస్తున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ రాక్షస. టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన రాక్షస ట్రైలర్‍ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా సీన్స్, దానికి అనుగుణంగా బీజీఎమ్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే!
Rakshasa Trailer Released In Telugu: కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

రాక్షస తెలుగు రైట్స్
గతంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాక్షస భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాక్షస ప్రమోషన్స్‌లో జోరు పెంచారు.
రాక్షస ట్రైలర్ రిలీజ్
అందుకే తాజాగా శనివారం (జనవరి 25) రాక్షస మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన చర్యలు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా భయపెడతాయి. ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు వచ్చే సీన్స్ మంచి హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
కూతురు మీద ప్రేమతో
అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ స్క్రీన్ ప్లేతో ఒక డిఫరెంట్‌గా ట్రైలర్‌ను కట్ చేశారు. రెండు మూడు డైలాగ్స్ బాగానే ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లోనే హీరో ఉండటం, అక్కడి నుంచి బయటపడకపోవడం, ఇతర పాత్రలు కూడా పోలీస్ స్టేషన్‌లో అత్యంత భయానికి గురి కావడం వంటి సీన్స్ ఆసక్తి కలిగించాయి. కూతురు మీద ప్రేమతో హీరో చేసే ప్రయత్నాలు, చర్యలు భయపెట్టేలా ఉంటాయి.
మరింతగా అంచనాలు పెరిగేలా
అలాగే, తను రాక్షసుడిలా మారే సీన్స్ ఆకట్టున్నాయి. ఇక రాక్షస ట్రైలర్‌లో నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్‌ను పెంచగా, తాజాగా విడుదలైన టైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా ఉంది.
థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్
ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రాక్షస ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కుతోంది" అని తెలిపారు.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను
"రాక్షస సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది" అని రాక్షస మూవీ నిర్మాత ఎంవీఆర్ కృష్ణ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం