Tollywood Releases This Week:ఫ్రైడే ఫిల్మ్ ఫెస్టివల్ - ఈ శుక్రవారం ఒక్క రోజే 11 తెలుగు సినిమాలు రిలీజ్
Tollywood Releases This Week: ఈ వారం థియేటర్లలో 11 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
Tollywood Releases This Week: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల జాతర నెలకొంది. శుక్రవారం మూడు, నాలుగు కాదు ఏకంగా 11 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ చిన్న సినిమాల్లో ఏది ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆ సినిమాలు ఏవంటే...
అభయ్ భేతిగంటి, అన్వేష్ మైఖేల్ హీరోలుగా నటిస్తోన్న రాక్షసకావ్యం సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్లమ్ ఏరియాలో జరిగే కథతో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈసినిమాకు శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన హారర్ మూవీ తంతిరం కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 22న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 13కు వాయిదాపడింది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్..
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన చిన్న సినిమా మధురపూడి గ్రామం అనే నేను మూవీ ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నది. శివ కంఠమనేని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు మల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
సగిలేటి కథ....
వీటితో పాటు సగిలేటి కథ, ద్రోహి, ప్రేమయుద్ధం, మిస్టరీ, గుణ సుందరి కథ, తికమక తాండ అనే చిన్న సినిమాలు అక్టోబర్ 13న థియేటర్ల ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. మా ఊరి సిన్మా ఒక రోజు ముందుగా అక్టోబర్ 12న విడుదల అవుతోంది.
గాడ్...
ఈ చిన్న సినిమాలతో పాటుగా నయనతార, జయంరవి ప్రధాన పాత్రల్లో నాయకానాయికలుగా నటించిన డబ్బింగ్ మూవీ గాడ్ కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది.
టాపిక్