తెలుగు యువ నటుడు రాకేశ్ వర్రే హీరోగా నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం 2019 అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంలో గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ మూవీకి బసవ శంకర్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు ఎవ్వరకీ చెప్పొద్దు చిత్రం రెండో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయితే, రెంటల్ పద్ధతిలో అడుగుపెట్టింది. రూ.99 రెంట్ చెల్లించి ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అయితే, గతంలోనే ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రం థియేటర్లలో రిలీజైన ఐదున్నరేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అది కూడా రెంటల్ పద్ధతిలో ఎంట్రీ ఇచ్చింది. రెగ్యులర్ స్ట్రీమింగ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు బసవ శంకర్. ప్రేమికులకు కులం ఇబ్బందిగా మారటం, కుటుంబాలను ఒప్పించే ప్రయత్నాలు చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమాలో రాకేశ్, గార్గేయితో పాటు వంశీ నెకంటి, రాజశేఖర్ అనిగి, కేశవ్ దీపక్, దుర్గాప్రసాద్ కే, సుజాత గోసుకొండ, ప్రసన్న కీలకపాత్రలు పోషించారు.
ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రానికి శంకర్ శర్మ సంగీతం అందించారు. హీరో రాకేశ్ వర్రేనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయలేకపోవటంతో జనాల్లోకి వెళ్లలేకపోయింది.
హారతి (గార్గేయి)ని హరి (రాకేశ్ వర్రే) ప్రేమిస్తాడు. కొన్నాళ్లకు హరిని హారతి కూడా ఇష్టపడుతుంది. కానీ ఇద్దరి కులాలు వేర్వేరు అని తెలుసుకున్న హారతి తాను ప్రేమిస్తున్న విషయాన్ని హరికి చెప్పదు. అయితే ఇష్టాన్ని మాత్రం పెంచుకుంటూనే ఉంటుంది. ప్రేమ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు అంగీకరించరని బాధపడుతుంది. ఈ క్రమంలో ఏమీ చెప్పకుండా హరికి దూరంగా హారతి వెళ్లిపోతుంది. హారతి ఎక్కడుందో కనుక్కొని హరి వెళతాడు. హారతిని హరి పెళ్లికి ఒప్పించాడా? హారతి కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు ఏం చేశాడు? చివరికి ఇద్దరూ వివాహం చేసుకున్నారా.. అనే అంశాల చుట్టూ ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రం సాగుతుంది.
తమిళ కామెడీ డ్రామా చిత్రం మిస్టర్ హౌస్‍కీపింగ్ చిత్రం నేడు ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామావీలో హరిభాస్కర్, లోసిల్య మరియనేసన్ లీడ్ రోల్స్ చేశారు.
సంబంధిత కథనం