Romantic Action OTT: పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
Romantic Action OTT: తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు మూవీలో రవితేజ నున్నా, నేహా జురేల్ హీరోహీరోయిన్లుగా నటించారు.

Romantic Action OTT: తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది మార్చిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
రవితేజ, నేహా జురేల్...
ఈ రొమాంటిక్ మూవీలో రవితేజ నున్నా, నేహా జురేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. యోగి ఖత్రి, నాగినీడు, ప్రమోదిని కీలక పాత్రలు పోషించారు. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం వహించాడు. కోటి తనయుడు రోషన్ సాలూరి మ్యూజిక్ అందించాడు. టైటిల
మర్డర్ మిస్టరీ....
లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించి దర్శకుడు సత్యరాజ్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మూవీని తెరకెక్కించాడు. కర్ణ (రవితేజ) తండ్రి నాయుడు గారు ఊళ్లో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. కర్ణ మాత్రం ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు.
అదే ఊరికి చెందిన నాయుడు గారి అమ్మాయి అనును (నేహా జురేల్) ప్రేమిస్తుంటాడు కర్ణ. అను హత్యకు గురవుతుంది. కర్ణనే అనును హత్య చేశాడని భావించి పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు.
జైలు నుంచి రిలీజైన కర్ణ...అనును చంపిన హంతకులను ఎలా పట్టుకున్నాడు? అను హత్యకు కర్ణ స్నేహితులకు ఉన్న సంబంధం ఏమిటి? ఊళ్లో ఫ్యాక్షన్ గొడవలకు కారకులు ఎవరు? కర్ణ తండ్రికి ఈ గొడవలతో సంబంధం ఉందా? అన్నదే ఈ మూవీ కథ.
ఐఎమ్‌డీబీలో...
చిన్న సినిమాగా రిలీజైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి ప్రేక్షకులకు మెప్పించలేకపోయింది. టైటిల్‌ను షార్ట్ చేస్తూ రానా పేరుతో ఈ మూవీని ప్రమోట్ చేశారు. వెరైటీ ప్రమోషన్స్ చేసినా రొటీన్ కాన్సెప్ట్ కారణంగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఐఎమ్‌డీబీలో మాత్రం 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ మూవీతోనే రవితేజ, నేహా జురేల్‌తో పాటు డైరెక్టర్ సత్యరాజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు.
టీవీ సీరియల్స్...
రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి కంటే ముందు హిందీలో పలు టీవీ సీరియల్స్ చేసింది నేహా జురేల్. మోల్కి సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో జ్యోతి అనే క్యారెక్టర్‌లో కనిపించింది.
సంబంధిత కథనం