Rajkumar Rao: నువ్వు ఇలాంటివి తప్ప మరో స్టోరీతో సినిమాలు చేయవా: బాలీవుడ్‌ నటుడితో ఆటాడుకున్న కమెడియన్-rajkummar rao bhool chuk maaf movie instagram comedian questions his story selection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajkumar Rao: నువ్వు ఇలాంటివి తప్ప మరో స్టోరీతో సినిమాలు చేయవా: బాలీవుడ్‌ నటుడితో ఆటాడుకున్న కమెడియన్

Rajkumar Rao: నువ్వు ఇలాంటివి తప్ప మరో స్టోరీతో సినిమాలు చేయవా: బాలీవుడ్‌ నటుడితో ఆటాడుకున్న కమెడియన్

Hari Prasad S HT Telugu
Published Feb 19, 2025 02:18 PM IST

Rajkumar Rao: బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ తో ఆటాడుకున్నాడు ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్. ఈ మధ్యే అతడు నటించిన భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ చూసిన తర్వాత అక్షత్ అనే ఆ కమెడియన్ అతన్ని ప్రశ్నలతో ముంచెత్తాడు.

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ తో ఆడుకున్న కమెడియన్ అక్షత్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ తో ఆడుకున్న కమెడియన్ అక్షత్

Rajkumar Rao: రాజ్ కుమార్ రావ్.. బాలీవుడ్ తోపాటు ఇండియాలో ఉన్న విలక్షణ నటుల్లో ఒకడు. సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి అతడు. కానీ అలాంటి నటుడు కూడా మూస కథలకే పరిమితమైపోయాడంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా వస్తున్న భూల్ చూక్ మాఫ్ నుంచి అంతకుముందు విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో, స్త్రీ2, హమ్ దో హమారే దో, రూహిలాంటి సినిమాలన్నింటిలోనూ అతడు చిన్న పట్టణం నుంచి సాధారణ యువకుడి పాత్రలే పోషించాడు.

అవే పాత్రలు ఇంకెన్నాళ్లు?

తాజాగా భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ రాగానే అక్షత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దేశంలో బెస్ట్ యాక్టర్ కూడా ఇలా ఒకే తరహా పాత్రలకు పరిమితమైపోతే ఎలా అని అతడు ప్రశ్నించాడు. "ఎందుకంటే వేరే కథే లేదు వినడానికి. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ లాంటి జానర్లన్నీ వేస్ట్. ఏదో ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు జీవితంలో పెళ్లి చేసుకోవాలని కల కంటూ ఉంటాడు.

ఎప్పుడూ ఇదే కథ ఉంటోంది వినడానికి. మనం దేశంలో అందరి కంటే మంచి నటుడు రాజ్ కుమార్ రావ్ ఇలాంటివి చేయడానికే పుట్టాడు" అని అక్షత్ అనడం గమనార్హం. నిజానికి రాజ్ కుమార్ రావ్ న్యూటన్ లాంటి ఓ డిఫరెంట్ జానర్ మూవీని ట్రై చేశాడని, చివరికి ఇలా ఒకే కథతో సినిమాలకు పరిమితమయ్యాడని అతడు అన్నాడు.

నిజమే కదా అంటున్న నెటిజన్లు

అక్షత్ అభిప్రాయంతో చాలా మంది అభిమానులు ఏకీభవిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ లాంటి నటుడు మూస కథలకే పరిమితమయ్యాడని వాళ్లు అంటున్నారు. మొదట్లో ఒకటి, రెండు సినిమాలు బాగానే అనిపించినా.. తర్వాత అతనికి కూడా హీరో కావాలన్న కోరిక పుట్టినట్లుందని ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం.

సిటీలైట్స్ సినిమా తర్వాత పెద్ద నగరాలకు పోకూడదని రాజ్ కుమార్ రావ్ నిర్ణయించుకున్నట్లున్నాడు అని మరొకరు అన్నారు. నిజానికి అతడు పోస్ట్ చేసిన మూవీ టీజర్ వీడియోపైనా కొందరు ఇలాంటి కామెంట్సే చేశారు. ఈ భూల్ చూక్ మాఫ్ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం