OTT Bold: 3 ఓటీటీల్లో బోల్డ్ హిస్టారికల్ మూవీ.. సెమీ న్యూడ్, శృంగార సీన్లు.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!-rajkahini ott streaming on amazon prime jiohotstar sun nxt 3 platforms in bengal historical drama about begum jaan ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold: 3 ఓటీటీల్లో బోల్డ్ హిస్టారికల్ మూవీ.. సెమీ న్యూడ్, శృంగార సీన్లు.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!

OTT Bold: 3 ఓటీటీల్లో బోల్డ్ హిస్టారికల్ మూవీ.. సెమీ న్యూడ్, శృంగార సీన్లు.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!

Sanjiv Kumar HT Telugu

Rajkahini OTT Streaming On 3 Platforms: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న హిస్టారికల్ బోల్డ్ డ్రామా చిత్రం రాజ్‌కహిని వేశ్యలపై తెరకెక్కింది. ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించుకున్న రాజ్‌కహిని 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బెంగాల్ విభజన సమయంలో అధికారులపై పోరాడిన బ్రోతల్స్ కథాంశంగా ఉంటుంది.

3 ఓటీటీల్లో బోల్డ్ హిస్టారికల్ మూవీ.. సెమీ న్యూడ్, శృంగార సీన్లు.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!

Rajkahini OTT Release On 3 Platforms: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి భాషా భేదం లేకుండా ఇతర భాషల్లోని సినిమాలను ఓటీటీ ఆడియెన్స్ చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక ఓటీటీలో హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌ను ఎక్కువగా ఇష్టపడేవారుంటారు.

ఫ్రెష్ కాన్సెప్ట్‌తో

అయితే, కంటెంట్ ఫ్రెష్‌గా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలను అయినా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో 2015లో విడుదలైన సినిమానే రాజ్‌కహిని. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. విమర్శకులు సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు. దాంతో రాజ్‌కహిని హిట్‌గా నిలిచింది.

రాజ్‌కహిని సినిమా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే సమయంలో సాగుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఒక సరిహద్దు గీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. అయితే, ఆ ప్రాంతంలో బేగం జాన్ నడుపుతున్న బ్రోతల్ హౌజ్ ఉంటుంది. దాంతో ఆ భవనాన్ని ఖాళీ చేయాలని బేగం జాన్‌కు ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇస్తారు.

మొదటగా పంపేది

కానీ, వారిని నోటీసును తిరస్కరించిన బేగం జాన్ "ఇది మీకు సరిహద్దు కావచ్చు, నాకు మాత్రం ఇదే ఇల్లు, ఇదే దేశం" అంటూ పోరాటానికి దిగుతుంది. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న వేశ్యలను నిత్యం పంపించుకునే రాజు సహాయం కోరుతుంది. బేగం జాన్ బ్రోతల్ ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయిని మొదట ఆ రాజు దగ్గరికే పంపేది బేగం జాన్.

కానీ, ఆ రాజు మాత్రం ఈసారి తన చేతుల్లో ఏం లేదని చేతులెత్తేస్తాడు. దాంతో తనతో ఉన్న వేశ్యలతో కలిసి అధికారులపై యుద్ధానికి సిద్ధమవుతుంది బేగం జాన్. మరి అధికారులపై బేగం జాన్ గెలిచిందా?, తన ఇంటిని కాపాడుకుందా? చివరికి ఏమైంది? అనే ఆసక్తికర అంశాలతో రాజ్‌కహిని సినిమాను శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించారు.

శృంగార సన్నివేశాలు

రాజ్‌కహిని సినిమాలో వేశ్యల జీవితం, వారి దగ్గరికి వచ్చే వ్యక్తుల మనస్తత్వం, చూపించి చూపించనట్లుగా ఉండే న్యూడ్ సీన్స్, శృంగార సన్నివేశాలు, ప్రేమించి మోసపోవడం, వేశ్యలను మనుషులు చూసే తీరు, ప్రవర్తించే విధానం వంటి ఎన్నో అంశాలతో హిస్టారికల్, బోల్డ్, ఎమోషనల్ సర్వైవల్, డ్రామాగా రాజ్‌కహిని తెరకెక్కింది.

ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించుకున్న రాజ్‌కహిని 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్), సన్ ఎన్‌ఎక్స్‌టీలో రాజ్‌కహిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం బెంగాలీ భాషలోనే రాజ్‌కహిని ఓటీటీలో అందుబాటులో ఉంది.

బేగం జాన్ ఓటీటీ

బెంగాలీలో తెరకెక్కిన రాజ్‌కహినిని ఓటీటీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. కాగా, రాజ్‌కహిని సినిమాను రెండేళ్లకు అంటే 2017లో బేగం జాన్ అనే టైటిల్‌తో హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇది కూడా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, గూగుల్ ప్లే మూవీస్ వంటి 3 ప్లాట్‌ఫామ్స్‌లలో బేగం జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం