OTT Telugu Web Series: ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా సిరీస్.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-rajiv kanakala telugu family drama web series home town will be streaming on aha from april 4 trailer is interesting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Web Series: ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా సిరీస్.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Telugu Web Series: ఓటీటీలోకి ఫ్యామిలీ డ్రామా సిరీస్.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Home Town OTT Web Series: హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. మిడిల్‍క్లాస్ కుటుంబం బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ వస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

OTT Family Series: ఓటీటీలోకి మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ డ్రామా సిరీస్.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో హోమ్‍టౌన్ వెబ్ సిరీస్ వస్తోంది. కొడుకును విదేశాల్లో చదివించాలని కలలు కనే మధ్య తరగతి తండ్రిగా ఈ సిరీస్‍లో రాజీవ్ నటించారు. 2000ల బ్యాక్‍డ్రాప్‍లో మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే ఈ సిరీస్‍లో ప్రజ్వల్ యద్మ, యానీ కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. 90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్ లాంటి సక్సెస్‍ఫుల్ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేసిన నవీన్ మేడారమే ఈ సిరీస్‍కు షోరన్నర్‌గా ఉన్నారు. హోమ్‍టౌన్ సిరీస్ ట్రైలర్ నేడు (మార్చి 25) రిలీజైంది.

మధ్యతరగతి పరిస్థితులతో..

మధ్యతరగతి కుటుంబంలో జరిగే పరిస్థితులతో హోమ్‍టౌన్ సిరీస్ ట్రైలర్ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కొడుకును విదేశాల్లో చదివించాలని అనుకునే తండ్రి.. చదువు ఇష్టం లేని కొడుకు ఇలా ట్రైలర్ సాగింది. ఫొటో స్టూడియో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు రాజీవ్ కనకాల. తన కుమారుడు శ్రీకాంత్ (ప్రజ్వల్)ను ఫారిన్‍లో చదివించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. వీరికి ఓ కుమార్తె (యానీ) కూడా ఉంటుంది. అయితే, శ్రీకాంత్ చదువులో వెనుకబడి ఉంటాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల గురించి రాజీవ్ కనకాల, ఝాన్సీ మాట్లాడుకోవడం కూడా ట్రైలర్లో చాలా మంది రిలేట్ అయ్యే విషయంగా ఉంది. టీనేజ్‍లో స్నేహితుల మధ్య సరదా సంభాషణలు కూడా ఉన్నాయి.

చదవడం తనతో కాదని తల్లితో శ్రీకాంత్ చెబితే.. రాజీవ్ కనకాల కోప్పడతాడు. సొంత ఊర్లోనే ఉండాలని అనుకుంటాడు శ్రీకాంత్. ఇష్టం లేకుండానే చదువుకొనసాగిస్తాడు. తనకు వేరే కోర్స్ చేయాలనుందంటూ బాధపడుతుంటాడు.

సరదాగా, ఎమోషనల్‍గా, మధ్యతరగతి కుటుంబ పరిస్థితులతో సాగిన హోమ్‍టౌన్ ట్రైలర్ ఆకట్టుకుంది. 90s సిరీస్ జోన్‍లోనే కనిపిస్తోంది. హోంటౌన్ సిరీస్‍కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ చాలా మందికి రిలేట్ అయ్యేలా, జ్ఞాపకాలను గుర్తుచేసేలా సాగనుంది. సురేశ్ బొబ్బిలి ఈ సిరీస్‍కు సంగీతం అందించారు. రాజశేఖర్ మేడారం నిర్మాతగా వ్యవహరించారు.

హోమ్‍టౌన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

హోమ్‍టౌన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్‍ను అధికారికంగా ఆహా కన్ఫర్మ్ చేసింది.

ట్రైలర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

హోమ్‍టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. దీనిపై ఓ సరదా వీడియోను ఈ సిరీస్ టీమ్ పోస్ట్ చేసింది. విజయ్‍ను అభిమానుల్లా కలిసి ఆయనకు తెలియకుండా ట్రైలర్ లాంచ్ చేయించామనేలా వీడియోను వెల్లడించింది. ఈ వీడియో సరదాగా సాగింది. ఏప్రిల్ 4 నుంచి ఆహాలో హోమ్‍టౌన్ సిరీస్‍ను చూడొచ్చు. ఈ సిరీస్ ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.

ఆహా ఓటీటీలో బ్రహ్మా ఆనందం చిత్రం గత వారం స్ట్రీమింగ్‍కు వచ్చింది. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 20న ఈ చిత్రం ఆహాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి 14న ఈ కామెడీ డ్రామా చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం