Rajinikanth: వెట్టైయాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ - సూర్యతో రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్!
Rajinikanth: రజనీకాంత్ వెట్టైయాన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోమవారం అనౌన్స్‌చేశారు. అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేరోజు సూర్య కంగువ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
Rajinikanth: రజనీకాంత్ వెట్టైయాన్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ విడుదల తేదీని సోమవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 10న వెట్టైయాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పోలీస్ డ్రెస్‌లో రజనీకాంత్ కనిపిస్తోన్నాడు. కాగా అక్టోబర్ 10న సూర్య కంగువ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. కంగువ మూవీతో వెట్టైయాన్ పోటీపడటం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర...
వెట్టైయాన్ మూవీకి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. అంధాకానూన్, గిరఫ్తార్, హమ్ సినిమాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా ఇది.
దాదాపు 35 తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేస్తోండటం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వెట్టైయాన్ మూవీలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, తెలుగు హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తోన్నారు. వీరితో పాటు మంజు వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
160 కోట్ల బడ్జెట్...
వెట్టైయాన్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మిస్తోన్నారు. దాదాపు నూట అరవై కోట్ల బడ్జెట్‌తో వెట్టైయాన్ మూవీ తెరకెక్కుతోన్నట్లు తెలిసింది. కాగా గతంలో లైకా ప్రొడక్షన్స్‌లో 2.0, దర్బార్, లాల్ సలామ్ సినిమాలు చేశాడు రజనీకాంత్. ఈ బ్యానర్‌లో రజనీ చేస్తోన్న నాలుగో మూవీ ఇది.
అంతే కాకుండా పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలయికలో రాబోతున్న నాలుగో మూవీ కూడా ఇది కావడం గమనార్హం. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్...
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు సమాచారం. నీతి, నిజాయితీలు ప్రాణంగా బ్రతికే పోలీస్ ఆఫీసర్ వ్యవస్థకు ఎందుకు ఎదురుతిరిగాల్సివచ్చిందనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా వెట్టైయాన్ మూవీలో ఓ సోషల్ మెసేజ్‌ను టచ్ చేయబోతున్నట్లు సమాచారం.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
థియేట్రికల్ రిలీజ్‌కు ముందే వెట్టైయాన్ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి, వెట్టైయాన్ తెలుగు, తమిళంతోపాటు మిగిలిన భాషల డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. అరవై ఐదు కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఈ సినిమా తెలుగు థ్రియేట్రికల్ హక్కులను ఏషియన్ సంస్థ పధ్నాలుగు కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు.
350 కోట్ల బడ్జెట్...
మరోవైపు సూర్య కంగువ సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హిస్టారికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాడీ డియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు.