Jailer Total Collections : బాక్సాఫీసు దుమ్ముదులిపేసిన రజనీకాంత్.. జైలర్ మెుత్తం కలెక్షన్స్ ఎంతంటే-rajinikanth starrer jailer movie total collection crossed 550 crore world wide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Rajinikanth Starrer Jailer Movie Total Collection Crossed 550 Crore World Wide

Jailer Total Collections : బాక్సాఫీసు దుమ్ముదులిపేసిన రజనీకాంత్.. జైలర్ మెుత్తం కలెక్షన్స్ ఎంతంటే

Anand Sai HT Telugu
Aug 24, 2023 01:46 PM IST

Jailer Total Collections : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. మెుదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటేసింది.

జైలర్ సినిమా కలెక్షన్స్
జైలర్ సినిమా కలెక్షన్స్

రజనీకాంత్‌ వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఈ వయసులోనూ యాక్షన్ హీరోగా దుమ్మురేపుతున్నాడు. అందుకు నిదర్శనం జైలర్ (Jailer Cinema) సినిమా వసూళ్లే . ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల రూపాయలు (Jailer Movie Collections) వసూలు చేసింది. ఇండియాలో 300 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. మిగతా సినిమాల నుంచి పోటీ ఉన్నా జైలర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజులుగా మంచి హిట్ లేని రజనీకి జైలర్‌ విజయం తీసుకొచ్చింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో బాగానే రన్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

జైలర్ సినిమా కుటుంబ కథాంశంతో తెరకెక్కింది. తన కొడుకు కోసం పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తాడు. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా నటించడం కూడా జైలర్ సినిమా(Jailer Cinema)కు కలిసి వచ్చింది. సాలిడ్ హిట్ అయింది. అభిమానులకు బాగా నచ్చుతుంది. విలన్ పాత్రలో కనిపించిన వినాయకన్ ఈ సినిమాలో చాలా హైలైట్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజింగ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. 'కావాలా..' పాటలో తమన్నా భాటియా డ్యాన్స్ చేసింది. ఈ పాట బాగా ట్రెండ్ అయింది.

ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది అతనికి నాలుగో సినిమా. విదేశాల్లోనూ రజనీకాంత్‌కు అభిమానులున్నారు. జైలర్ సినిమా వివిధ దేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచింది. మూడో వారంలో ఈ సినిమా మూడ్ కాస్త తగ్గింది. ఇండియాలో రూ.295 కోట్లు వసూలు చేసి త్వరలో రూ.300 కోట్ల మార్కును అందుకోనుంది. మెుత్తానికి ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఇంకా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ‘సన్ నెక్స్ట్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో రిలీజ్ అయిన 28 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేలా ఈ చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసుకుంది. దీని ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన జైలర్ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. అయితే, ఈ డేట్‍పై అధికారికంగా ప్రకటన రాలేదు. మరో వారంలో జైలర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‍పై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ థియేటర్లలో కలెక్షన్లు స్థిరంగా ఉంటే.. ఓటీటీ రిలీజ్ విషయంలో జైలర్ మూవీ యూనిట్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.