Rajinikanth: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించాడు. కల్కి మూవీ ఎపిక్ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశాడు. కల్కి మూవీని చూశానని, అద్భుతంగా ఉందని రజనీకాంత్ అన్నాడు. కల్కితో ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ డిఫరెంట్ లెవెల్‌కు తీసుకెళ్లాడని తన ట్వీట్‌లో రజనీకాంత్ పేర్కొన్నాడు. కల్కి పార్ట్ 2 కోసం తాను వెయిటింగ్ అని ఈ ట్వీట్‌లో తెలిపాడు.
ఈ సినిమాలో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌తో పాటు ప్రభాస్, దీపికా పదుకోణ్ అసమాన నటనను కనబరిచారని రజనీకాంత్ అన్నాడు. నిర్మాత అశ్వనీదత్‌తో పాటు ఎంటర్‌టైనర్ కల్కి టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ రజనీకాంత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తోన్నారు.
భారతీయ పురాణాలకు గ్రాఫిక్స్, యాక్షన్ హంగులను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెరకెక్కించాడు. తొలిరోజు 191. 5 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులను సృష్టించింది కల్కి మూవీ. ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది.తెలుగులోనూ ఈ ఏడాది హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ దక్కించుకున్న మూవీగా ఎవరికి అందనంత ఎత్తులో కల్కి నిలిచింది.
రెండు రోజు మాత్రం కల్కి కలెక్షన్స్ నలభై శాతానికి పైగా పడిపోయాయి. ఇండియా వైడ్‌గా శుక్రవారం ఈ మూవీ 95 కోట్ల మేర కలెక్షన్స్ సొంతం చేసుకున్నది.
తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే 130 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్, 64 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో వంద కోట్లకుపైనే రావాలి. తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ 168 కోట్ల వరకు జరిగింది. హిందీలో తొలిరోజు 22 కోట్లు, రెండో రోజు 21 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ మూవీస్‌లో ఒకటిగా కల్కి కొనసాగుతోంది.
కల్కి సినిమాలో భైరవ అనేసూపర్ హీరో పాత్రలో కామెడీ టైమింగ్‌తో ప్రభాస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోన్నాడు. ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో అభిమానులను అలరిస్తోన్నాయి. ప్రభాస్, అమితాబ్‌బచ్చన్ మధ్య వచ్చే సీన్స్ పోటాపోటీగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటోన్నారు.
దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటించింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆరాటపడే తల్లిగా ఓ ఎమోషనల్ రోల్‌లో నాచురల్ యాక్టింగ్‌ను దీపికా కనబరిచింది. సుప్రీమ్ యాశ్కిన్ అనే పాత్రలో విలన్‌గా డిఫరెంట్ గెటప్‌లో కమల్ హాసన్ కనిపించాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తో పాటు డైరెకర్లు రాజమౌళి, ఆర్‌జీవీ, అనుదీప్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఫఱియా అబ్దుల్లా గెస్టులుగా తళుక్కున మెరిశారు.
కాంప్లెక్స్ శంబాలా అనే డిఫరెంట్ వరల్డ్స్ చుట్టూ కల్కి కథను రాసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమతి ఎవరు? ఆమెను సుప్రీమ్ యాశ్కిన్ మనుషులకు అప్పగించి కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని భైరవ ఎందుకు అనుకున్నాడు. భైరవ ప్రయత్నాల్ని అశ్వత్థామ ఎలా అడ్డుకున్నాడు అన్నదే కల్కి కథ.