Rajinikanth Remuneration: రజనీకాంత్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్‌-rajinikanth remuneration for thalaivar 171 is huge according to a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajinikanth Remuneration For Thalaivar 171 Is Huge According To A Report

Rajinikanth Remuneration: రజనీకాంత్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్‌

Hari Prasad S HT Telugu
Nov 03, 2023 01:56 PM IST

Rajinikanth Remuneration: రజనీకాంత్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్‌గా రికార్డు క్రియేట్ చేశాడతడు.

సూపర్ స్టార్ రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్

Rajinikanth Remuneration: సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో మళ్లీ గాడిలో పడ్డాడు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీతో మరోసారి రజనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. దీంతో ఇప్పుడు అతడు నటించబోయే తలైవా 171 మూవీ కోసం రజనీ కళ్లు చెదిరే మొత్తం రెమ్యునరేషన్ గా అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్ గా రజనీకాంత్ నిలవనున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీ చేయబోతున్న మూవీ ఇది. ఈ ఇద్దరి అరుదైన కాంబినేషన్ కావడంతో అప్పుడే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

ఈ తలైవార్ 171 మూవీ కోసం రజనీకాంత్ ఏకంగా రూ.260 నుంచి రూ.280 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఇంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ రావడానికి ముందు ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసువాల్సిందిగా రజనీని కోరినా.. అతడు నిరాకరించాడట. కమల్ హాసన్ తో విక్రమ్, విజయ్ తో లియో మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేయడంతో రజనీతో అంతకు మించిన సినిమా చేయడానికి లోకేష్ కనగరాజ్ సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాపై ఉన్న అంచనాలను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ రెడీ అవుతుంటే.. రజనీ కూడా తన రెమ్యునరేషన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమైతే.. ఇండియాలోనే కాదు ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకోబోతున్న హీరోగా రజనీ నిలుస్తాడు. గతంలోనూ రజనీ ఓసారి స్టార్ హీరో జాకీ చాన్ రెమ్యునరేషన్ ను మించి తీసుకున్నాడు.

రజనీకాంత్ జైలర్ మూవీని ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్సే ఈ తలైవార్ 171 ను కూడా నిర్మిస్తోంది. జైలర్ మూవీ కోసమే రజనీ రూ.200 కోట్లకుపైగా వసూలు చేసి ఇండియాలో అత్యధిక మొత్తం అందుకున్న హీరోగా నిలిచాడు. అది కాకుండా జైలర్ కలెక్షన్ల వర్షం కురిపించిన తర్వాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్.. రజనీ ఇంటికి వెళ్లి అతనికి ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.