Jailer Showcase: ‘జైలర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది: రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదుర్స్: చూసేయండి-rajinikanth movie jailer trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Showcase: ‘జైలర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది: రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదుర్స్: చూసేయండి

Jailer Showcase: ‘జైలర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది: రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదుర్స్: చూసేయండి

Jailer Trailer: రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. తలైవా స్టైల్ ఆకట్టుకుంటోంది.

జైలర్ పోస్టర్

Jailer Showcase: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్‌తో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా ఈ జైలర్ మూవీ వస్తోంది. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై రజినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో జైలర్ సినిమా ట్రైలర్ నేడు (ఆగస్టు 3) రిలీజ్ అయింది. జైలర్ షోకేస్ పేరుతో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. వివరాలివే..

జైలర్ షోకేస్ పవర్‌ఫుల్‍గా ఉంది. రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. తలైవా రజినీ మార్క్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు యాక్టర్ సునీల్ కాస్త డిఫరెంట్ గెటప్‍లో కనిపించాడు. “ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లి పిల్లలా ఉంటారు. కానీ దడేల్‍గా పులిలా మారతారు” అంటూ రజినీని ఉద్దేశించి డాక్టర్ చెప్పిన డైలాగ్ ఉంది. పోలీస్ అయిన కొడుకు షూ పాలీష్ చేస్తూ ట్రైలర్‌లో కనిపించారు రజినీ. అయితే, ఆ తర్వాత యాక్షన్ మోడ్‍లోకి ట్రైలర్ మారుతుంది. “ఒకరేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే” అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లలో రజినీ స్టైల్ ఆకట్టుకుంటుంది. రజినీ లుక్ కూడా సూపర్‌గా ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. టైగర్‌గా హుకుం అంటూ రజినీ చెప్పే డైలాగ్‍తో షోకేస్ ముగిసింది. మొత్తంగా జైలర్ ట్రైలర్ షోకేస్ ఆకట్టుకునేలా ఉంది. జైలర్ మూవీ థియేటర్లలో ఆగస్టు 10న విడుదల కానుంది.

జైలర్ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా భాటియా, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. మలయాళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. 

జైలర్ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కావాలా పాటతో ఈ మూవీపై క్రేజ్ మొదలైంది. హుకుం సాంగ్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ చిత్రంపై రజినీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.