Rajinikanth vs Mahesh babu: మహేష్‌బాబుతో రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్ - జైలర్ రిలీజ్ డేట్ మారనుందా?
Rajinikanth vs Mahesh babu: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ మారనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ఎస్ఎస్ఎంబీ28 సినిమాతో బాక్సాఫీస్ వద్ద జైలర్ పోటీపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Rajinikanth vs Mahesh babu: బాక్సాఫీస్ వద్ద మహేష్‌బాబుతో పోటీపడేందుకు రజనీకాంత్ సిద్ధమవుతోన్నట్లు సమాచారం. మహేష్‌బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ఎస్ఎస్ఎంబీ 28 మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అదే రోజు రజనీకాంత్ జైలర్ సినిమాకూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఈ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనివార్య కారణాల వల్ల జైలర్ మూడు నెలలు పోస్ట్‌పోన్ కానున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14న కాకుండా ఆగస్ట్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
జైలర్ సినిమాలో మెహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. కాగా ఎస్ఎస్ఎంబీ 28 సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సి ఉండగా ఆగస్ట్ 11కు పోస్ట్‌పోన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.