Rajinikanth: రెమ్యూనరేషన్ విషయంలో రజినీకాంత్ నేషనల్ రికార్డు.. దేశంలోనే టాప్! ఎన్ని కోట్లంటే?-rajinikanth becomes highest paid actor in india after jailer blockbuster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth: రెమ్యూనరేషన్ విషయంలో రజినీకాంత్ నేషనల్ రికార్డు.. దేశంలోనే టాప్! ఎన్ని కోట్లంటే?

Rajinikanth: రెమ్యూనరేషన్ విషయంలో రజినీకాంత్ నేషనల్ రికార్డు.. దేశంలోనే టాప్! ఎన్ని కోట్లంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 01, 2023 09:33 PM IST

Rajinikanth: జైలర్ సినిమా విజయంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న యాక్టర్‌గా తలైవా నిలిచినట్టు సమాచారం.

కళానిథి మారన్ నుంచి చెక్ అందుకుంటున్న తలైవా రజినీకాంత్
కళానిథి మారన్ నుంచి చెక్ అందుకుంటున్న తలైవా రజినీకాంత్

Rajinikanth: జైలర్ చిత్రం బంపర్ హిట్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా సూపర్ బ్లాక్‍బాస్టర్ అయింది. ఇంకా వసూళ్లను రాబడుతోంది. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన జైలర్.. ఇప్పటి వరకు రూ.600 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్‍లో రూ.700కోట్లకు చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో రజినీ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అనేక రికార్డులను కూడా జైలర్ సినిమా నెలకొల్పుతోంది.

yearly horoscope entry point

జైలర్ సినిమా భారీ కలెక్షన్లను సాధించటంతో ఈ చిత్రాన్ని నిర్మించిన కళానిధి మారన్.. హీరో రజినీకాంత్‍కు నేడు ఓ చెక్ ఇచ్చారు. సినిమా లాభాల్లో షేర్‌ను ఆయన తలైవాకు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా రజినీకాంత్ నిలిచారని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. ఇండియాలో ఓ చిత్రానికి అత్యధిక మొత్తం అందుకున్న నటుడిగా రజినీ రికార్డు సృష్టించారని ట్వీట్ చేశారు. లెక్కలను కూడా వివరించారు.

రజినీకాంత్‍కు రూ.100 కోట్ల విలువైన చెక్‍ను కళానిధి మారన్ నేడు అందించారని మనోబాల ట్వీట్ చేశారు. చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ మందవెలి బ్రాంచ్‍కు చెందిన రూ.100 కోట్ల చెక్‍ను రజినీకి ఇచ్చారని తెలిపారు. జైలర్ సినిమాకు ముందు రెమ్యూనరేషన్‍గా రజినీకాంత్ రూ.110కోట్లు అందుకున్నారు. ఈ రూ.110 కోట్లు, ఇప్పుడు చెక్ రూపంగా ఇచ్చిన రూ.100 కోట్లు (అదనపు రెమ్యూనరేషన్) కలిపి.. జైలర్ చిత్రానికి గాను రజినీకాంత్ మొత్తంగా రూ.210కోట్లు అందుకున్నారని మనోబాల విజయబాలన్ వివరించారు. ఇలా, దేశంలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా రజినీ నిలిచారని ట్వీట్‍లో పేర్కొన్నారు. అయితే, అధికారికంగా ఈ లెక్కలు వెల్లడి కాలేదు.

అలాగే, రజినీకాంత్‍కు బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును కూడా కళానిధి మారన్ బహుమతిగా ఇచ్చారు. ఈ కారును కీని ఆయన తలైవాకు అందించారు. అలాగే, జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్‌కు కూడా కారు లగ్జరీ కారు ఇచ్చారు కళానిధి మారన్. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Whats_app_banner