Suriya on Rajinikanth: ‘ఎస్కేప్ అవొద్దు’: రజినీకాంత్ ఇచ్చిన ఆ సలహా నా మనసులో నిలిచిపోయింది: సూర్య-rajinikanth advice still in my mind says suriya in kanguva promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya On Rajinikanth: ‘ఎస్కేప్ అవొద్దు’: రజినీకాంత్ ఇచ్చిన ఆ సలహా నా మనసులో నిలిచిపోయింది: సూర్య

Suriya on Rajinikanth: ‘ఎస్కేప్ అవొద్దు’: రజినీకాంత్ ఇచ్చిన ఆ సలహా నా మనసులో నిలిచిపోయింది: సూర్య

Chatakonda Krishna Prakash HT Telugu
Published Oct 23, 2024 08:14 AM IST

Suriya on Rajinikanth: తలైవా రజినీకాంత్ ఓ సందర్భంలో తనకు ఇచ్చిన సలహా మనసులో నిలిచిపోయిందని సూర్య చెప్పారు. కంగువ ప్రమోషన్లలో ఈ విషయం వెల్లడించారు. కంగువ సినిమా కొత్త ప్రపంచంలా ఉంటుందని అన్నారు.

Suriya on Rajinikanth: ‘ఎస్కేప్ అవొద్దు’: రజినీకాంత్ ఇచ్చిన ఆ సలహా నా మనసులో నిలిచిపోయింది: సూర్య
Suriya on Rajinikanth: ‘ఎస్కేప్ అవొద్దు’: రజినీకాంత్ ఇచ్చిన ఆ సలహా నా మనసులో నిలిచిపోయింది: సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య.. కెరీర్ ఆరంభం నుంచి ఓ వైపు పక్కా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు. సెవెంత్ సెన్స్, 24, బ్రదర్స్, గజినీ, జై భీమ్ సహా కొన్ని సినిమాలు పర్ఫార్మెన్స్ ప్రధానమైన, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో చేశారు. సూర్య హీరోగా నటించిన కంగువ చిత్రం రిలీజ్‍కు రెడీ అయింది. ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందింది. కెరీర్లో తాను విభిన్నమైన చిత్రాలు చేసేందుకు రజినీకాంత్ గతంలో ఇచ్చిన ఓ సలహా తోడ్పడిందనేలా సూర్య తాజాగా చెప్పారు.

కంగువ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సూర్య తాజాగా మాట్లాడారు. ఈ సందర్భంగా సుమారు 20ఏళ్ల క్రితం రజినీకాంత్ తనకు ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు తన మనసులో నిలిచిపోయాయని చెప్పారు.

రెండూ చేయాలని చెప్పారు

నటుడిగా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఉండాలని రజినీకాంత్ తనకు చెప్పాలని సూర్య తెలిపారు. యాక్షన్ సినిమాలు చేస్తూ ఎస్కేప్ అవుతూ ఉండకూడదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. “రజినీకాంత్ ఓ సారి నాకు ఫ్లైట్‍లో కొన్ని మాటలు చెప్పారు. నువ్వు హీరో.. అలాగే నటుడివి కూడా అని, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు. కేవలం యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఎస్కేప్ అవకూడదని చెప్పారు. సినిమాల మధ్య బ్యాలెన్స్ ఉండాలన్నారు. ప్రజలు రెండూ ఆశిస్తారని అన్నారు” అని రజినీ ఇచ్చిన సలహాను సూర్య వెల్లడించారు.

20 ఏళ్ల కిందట..

సుమారు 20 ఏళ్ల క్రితం తనకు రజినీకాంత్ ఆ మాటలు చెప్పారని సూర్య తెలిపారు. అయితే, తన మెదడులో ఆ మాటలు ఎక్కడో నిలిచిపోయానని అన్నారు. “నేను జనాలను ఎంటర్‌టైన్ చేయాలని అనుకుంటున్నా. నేను సింగం చేయాలనుకుంటా.. జై భీమ్ కూడా చేయాలని అనుకుంటా. రెండూ చేయాలనుకుంటా” అని సూర్య అన్నారు. అలా రెండు రకాల సినిమాలు చేస్తుండటం తన అదృష్టమని, డైరెక్టర్లు అలాంటి స్క్రిప్ట్‌లు తీసుకొస్తుండడం వల్ల సాధ్యమవుతోందని అన్నారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లా కంగువ

బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలను మనం చూశామని, తమిళంలో కంగువ కూడా ఆ రేంజ్ చిత్రంగా ఉంటుందని సూర్య అన్నారు. ఈ చిత్రం కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని చెప్పారు. “వేరే భాష నుంచి మనం బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలను చూశాం. అలా తమిళంలో కంగవ పెద్ద స్టెప్‍గా ఉంటుంది. తమిళ సినిమాలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రపంచాన్ని పరిచయం చేయలేదు” అని సూర్య చెప్పారు.

కంగువ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. సూర్య డ్యుయల్ రోల్ చేశారు. ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు నిర్మించాయి. నవంబర్ 14వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ సహా మొత్తంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది.

Whats_app_banner